హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కింగ్డమ్'. ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా శనివారం సాయంత్రం తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''అందరూ బాగుండాలి.. అందరం బాగుండాలి. ఈతురి నేరుగా మీకాడికే వచ్చినం. మీ అందర్నీ కలిసినం. ట్రైలర్ లేట్ అయినాది. అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినం. మీ అరుపులు కేకలు వింటాంటే శానా సంతోషంగా అనిపిస్తోందబ్బా. మీ అందరికీ ఓ మాట జెప్పాల. ఇంతవరకూ బయట చెప్పిందేలే. గత ఏడాది నుంచి 'కింగ్డమ్' సినిమా గురించి కానీ, రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తే నా తల కాయలో ఒకటే తిరుగుతుంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ.. ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. శానా పెద్దోన్నైపుడుస్తా సామీ.. పోయి టాప్ లో కూసుంటా'' అంటూ పుష్పరాజ్ స్టైల్ లో చిత్తూరు స్లాంగ్ లో ఆకట్టుకున్నారు.