: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గంగా చెబుతుంటారు. గత కొన్ని సంవత్సరాల ఫండ్స్ పని తీరు గమనిస్తే చాలా వరకు ఫండ్స్ అంచనాలను మించి రాబడులు అందించాయి. అలాగే ప్రస్తుతం డిజిటల్ పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది, ముఖ్యంగా యువత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి నెలా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. జూలై 28, 2025 తేదీ నుంచే ఈ స్కీమ్స్ సబ్‌స్క్రిప్షన్ మొదలవుతోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. కోటక్ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త స్కీమ్కోటక్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ (Kotak Nifty Alpha 50 Index Fund) అనేది ఒక ఇండెక్స్ ఫండ్. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జూలై 28, 2025 రోజునే మొదలవుతోంది. ఆగస్టు 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100 మాత్రమే.బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ నుంచి సేవింగ్స్ ఫండ్ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జూలై 28, 2025 రోజునే మొదలవుతోంది. ఆగస్టు 11వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500 మాత్రమే.కోటక్ ఏఎంసీ నుంచి మూమెంటమ్ ఫండ్కోటక్ యాక్టివ్ మ్యూమెంటమ్ ఫండ్ () అనేది ఒక థెమాటిక్ ఫండ్. ఈ సబ్‌స్క్రిప్షన్ జూలై 29వ తేదీన మొదలై ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. 360 వన్ నుంచి మల్టీ అసెట్ ఫండ్360 వన్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ (360 One Multi Asset Allocation Fund) పేరుతో తీసుకొస్తున్న ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ జూలై 30 నుంచి మొదలవుతోంది. ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో రూ.1000 నుంచే పెట్టుబడి మొదలవుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ప్రముఖ ఏఎంసీ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ కేటగిరీలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ () తీసుకొస్తోంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) సబ్‌స్క్రిప్షన్ జూలై 31వ తేదీన మొదలై ఆగస్టు 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000 గా ఉంది.