ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? లిమిట్ దాటితే ఐటీ నోటీసులు.. క్రెడిట్ కార్డు బిల్స్ నుంచి ఎఫ్‌డీ వరకు లిస్ట్ ఇదే..

Wait 5 sec.

: మన దేశంలో సంపాదనపై టాక్స్ ఉంటుంది. అంటే సంవత్సరానికి.. శాఖ విధించే పరిమితికి మించి సంపాదించిన వారు పన్ను శ్లాబుల్ని పట్టి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత దానికి సంబంధించి టాక్స్ కట్టాలి. అయితే ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు పరిమితికి మించి చేసే లావాదేవీలు.. టాక్స్ పరిధిలోకి వచ్చేలా చేస్తాయి. ఇక్కడ మీరు ఎవరికీ తెలియదని అనుకోవద్దు.. ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది. అందుకే ఇలాంటి సమస్య రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ సీఏ, టాక్స్ ఎక్స్‌పర్ట్ నితిన్ కౌశిక్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రూ. 10 లక్షలకు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్- మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు చెందిన అన్ని పొదుపు ఖాతాల్లో (సేవింగ్స్ అకౌంట్లు) కలిపి రూ. 10 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేయొద్దు. ఈ మొత్తాన్ని మీరు ఒకే అకౌంట్లో కాకుండా వేర్వేరు అకౌంట్లలోకి మళ్లించినా.. సీబీడీటీకి బ్యాంకులు రిపోర్ట్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడులు- మీరు వేర్వేరు బ్యాంకుల్లో కలిపి 10 లక్షలకుపైగా ఎఫ్‌డీ చేసినా బ్యాంకులు ఈ వివరాల్ని ఐటీ విభాగానికి పంపిస్తాయి. డిపాజిట్లపై వచ్చేటువంటి వడ్డీ ఆదాయం కూడా పన్ను లోబడి ఉంటుంది. ఇక్కడ మీ సంవత్సర ఆదాయం, మీరు ప్రకటించిన ఆదాయానికి మధ్య తేడా వస్తే ఐటీ శాఖ చర్యలు తీసుకోవచ్చు.క్రెడిట్ కార్డు బిల్లు- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షకు మించి క్యాష్ లేదా రూ. 10 లక్షలకుమించి చెక్ లేదా డిజిటల్‌లో క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ చేస్తే ఇది కూడా ఐటీ విభాగానికి తెలుస్తుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల విక్రయం- రూ. 30 లక్షలకు మించి ఆస్తి విక్రయించడం లేదా కొనుగోలు చేయడం కూడా ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. ఇక్కడ మీరు ఆ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి డాక్యుమెంటేషన్ సహా నిధులు ఎక్కడినుంచి వచ్చాయనేది సరిగా చూయించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు- వీటిల్లో కూడా మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే కూడా.. ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ ఇన్‌కం రిటర్న్స్‌లో సరిగా చూయించాలి. విదేశీ ప్రయాణ ఖర్చులు- మీరు విదేశీ ప్రయాణం చేస్తున్నట్లయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే అది కూడా ఐటీ శాఖ గుర్తిస్తుంది. ఇక్కడ మీరు ఆ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూయించాల్సి ఉంటుంది. గమనిక: మీరు ఏడాదిలో ఇవన్నీ చేసిన అందరికీ నోటీసులు వస్తాయని కాదు. కానీ మీరు వీటిని ఐటీఆర్‌లో రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తొచ్చు. అంటే మీరు సంపాదించిన ప్రతి రూపాయీ లెక్క చెప్పాలన్నమాట.