ఏపీలో వారందరికీ భారీ శుభవార్త.. ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్.. మరో హామీ నేటి నుంచే అమలు..

Wait 5 sec.

AP Government Free Power Scheme Starts from August 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభవార్త వినిపించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత కరెంట్ పథకం ప్రారంభించింది. వాస్తవానికి ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తారనే వార్తలు వచ్చాయి. చేయాలని భావించారు. అయితే వారం రోజుల ముందుగానే అమలుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచే చేనేత కార్మికుల ఇళ్లకు అమలు చేయడానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ తీసుకున్నారు. తాజాగా నేటి నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 50 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు, అలాగే 15 వేల పవర్ లూమ్స్ యజమానులకు లబ్ధి చేకూరనుంది. కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు చేయనుంది. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ చేతివృత్తుల వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా నేతన్నల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి అండగా నిలిచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పథకం కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటంతో మగ్గాలు ఉన్న చేనేత కుటుంబాలకు ప్రతి నెలా రూ.950 నుంచి రూ.1250 వరకూ ప్రయోజనం కలగనుంది. అలాగే పవర్ లూమ్స్ నిర్వాహకులకు నెలకు రూ.2,500 వరకూ లబ్ధి కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో .. మంత్రి సవిత సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.