ఏపీలో కరెన్సీ 'నోట్ల ఆస్పత్రులు'.. కాలిపోయిన, చిరిగిపోయిన కరెన్సీని మార్చుకోవచ్చు

Wait 5 sec.

ఏపీలో కరెన్సీ నోట్లకు ఆస్పత్రులు ఉన్నాయని మీకు తెలుసా.. అవును మీరు వింటున్నది నిజమే.. నోట్ల ఆష్పత్రుల పేరుతో కరెన్సీని మార్చుకునే అవకాశం ఉంది. కాలిపోయిన, చిరిగిపోయిన నోట్లు తీసుకుని ఇక్కడ మంచి నోట్లు ఇస్తారు. అది కూడా గుంటూరులోని జిన్నా టవర్ దగ్గర ఈ వెరైటీ బిజినెస్ జరుగుతోంది.అంతేకాదు ఈ కరెన్సీ నోట్ల ఆస్పత్రి 1970 నుంచి ఈ వ్యాపారం నడుస్తోంది. ప్రజలు చిరిగిన, కాలిన నోట్లను ఇక్కడకు తెచ్చి మార్చుకుంటారు. నోటు ఎంత పాడైందో చూసి, దాని విలువను నిర్ణయిస్తారు.వాస్తవానికి గతంలో చిరిగిన, కాలిన నోట్లను ఆర్‌బీఐ శాఖల్లో, కొన్ని బ్యాంకుల్లో ఉంటుంది.. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది. నోట్ల ఆస్పత్రిలో నోటును చూసి, దాని పరిస్థితిని బట్టి డబ్బులు ఇస్తారు. ఉదాహరణకు.. ఎవరైనా రూ.500 నోటు పాడైపోయిందని ఇస్తే.. అది ఎంతవరకు పాడైందో చూస్తారు. అప్పుడు ఆ నోటు పరిస్థితిని బట్టి రూ.200 నుంచి రూ.350 వరకు విలువ కట్టి మంచి నోట్లు అందజేస్తారు. ఇలా నోట్ల ఆస్పత్రుల్లో తీసుకున్న పాడైపోయిన నోట్లను కమీషన్ తీసుకుని హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో నోట్లను మారుస్తున్నారు. గుంటూరు మాత్రమే కాదండోయ్.. ఈ నోట్ల ఆస్పత్రులకు విజయవాడ, తెనాలి, రాజమహేంద్రవరంలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ సేవల్ని స్థానిక ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవలో ఓ వ్యక్తి రెండేళ్లుగా పాడైపోయిన నోట్లను పోగు చేసిన రూ.10, రూ.50, రూ.500 నోట్లు కలిపి మొత్తం రూ.970 విలువైన నోట్లను గుంటూరులోని నోట్ల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అక్కడ నోట్లను పరిశీలించి.. పాడైపోయిన వాటికి బదులుగా రూ.750 చెల్లుబాటు అయ్యే నోట్లు తిరిగి ఇచ్చారట. అంటే నోట్ల ఆస్పత్రిలో రూ.220 కమిషన్ కింద తీసుకుని మిగిలిన డబ్బును తిరిగి ఇచ్చారు. ఎవరైనా చిరిగిన, కాలిపోయిన నోట్లు ఉంటే వెంటనే నోట్ల ఆస్పత్రికి తీసుకెళితే మార్చుకోవచ్చు.. కాకపోతే కండిషన్స్ అప్లై అని మర్చిపోవద్దు.