మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు శ్రీవారి దర్శనం కోసం ఆదివారం తిరుమలకు వచ్చారు. వెంకయ్య నాయుడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి ఆదివారంలో ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.. వెంకయ్య భక్తులతో కొద్దిసేపు ముచ్చటించారు. 'అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా బావున్నాయి. అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉంది. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహక్తులకు సేవలందించడం ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు' అని టీటీడీ తెలిపింది. వెంకయ్య నాయుడు స్వయంగా వెళ్లి టీటీడీ సేవలపై, అన్నప్రసాదంపై బుక్‌లో ఫీడ్‌బ్యాక్ కూడా రాశారు.ఆగస్టు నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి గ్రూప్ ఆలయాలలో విశేష ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఆగస్టు 01, 15, 22, 29వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శన‌మివ్వనున్నారు. ఆగస్టు 8న ఉద‌యం 10 గంట‌లకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. సాయంత్రం 6 గంట‌లకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో ఆగస్టు 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించ‌నున్నారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ఆగస్టు 16న గోకులాష్ఠమి సందర్భంగా పెద్దశేష వాహనంపై స్వామివారు క‌టాక్షించ‌నున్నారు. ఆగస్టు 17న ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆగస్టు 26న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుచానూరు శ్రీనివాస ఆలయంల ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంటలో ఆగ‌స్టు 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహిస్తారు. ఆగ‌స్టు 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం ఉంటుంది. ఆగ‌స్టు 5న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.. ఆగ‌స్టు 9న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.. ఆగ‌స్టు 13న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తారు.