బెన్ స్టోక్స్ ఫ్రస్టేషన్.. 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే డ్రాకు ఆఫర్.. ఇచ్చిపడేశిన జడేజా..!

Wait 5 sec.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఇంగ్లాండ్‌కు.. భారత బ్యాటర్ల వీరోచిత పోరాటంతో ఆశాభావం ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించినా.. డ్రా తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే చివరి సెషన్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.అసలేం జరిగిందంటే..ఐదో రోజు చివరి సెషన్‌లో మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. అయితే అప్పటికీ భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది.. 50కి పైగా ఆధిక్యం సంపాదించింది. కానీ ఈ సమయంలో కు చేరువయ్యారు. 80 పరుగుల మార్కును దాటారు. ఈ పరిస్థితి గమనించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఓ వింత ప్రతిపాదన తెరమీదకు తెచ్చాడు. వారి సెంచరీలు చేయకూడదనే ఉద్దేశంతో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే డ్రాకు ప్రతిపాదించాడు. కానీ దీన్ని భారత్.. నిర్మొహమాటంగా తిరస్కరించింది.డ్రా ఆఫర్ చేస్తూ బెన్ స్టోక్స్.. రవీంద్ర జడేజాకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ జడ్డూ అందుకు ఒప్పుకోలేదు. నాకేం సంబంధం లేదు.. మా కెప్టెన్‌ను అడుక్కో అన్నట్లు చెప్పాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై చాలా సేపు గ్రౌండ్‌లో చర్చ జరిగింది. ఇదే విషయంపై అంపైర్లు, జడ్డూ, సుందర్ వైపు చూస్తూ స్టోక్స్ తన నోటికి పని చెప్పాడు.ఓ దశలో రవీంద్ర జడేజా దగ్గరకు వచ్చి.. "బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీ చేద్దాం అనుకుంటున్నావా" అని వెటకారంగా అన్నాడు. అయితే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బెన్ స్టోక్స్ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు బౌలింగ్ వేయండి.. మేం బ్యాటింగ్ చేస్తాం అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ నుంచి కెప్టెన్ గిల్ గమనిస్తూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాసేపటికే తొలుత జడేజా, ఆ తర్వాత సుందర్ సెంచరీలు పూర్తి చేసుకుని.. డ్రాకు అంగీకరించారు. అయితే స్టోక్స్ వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. తన జట్టులోని ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితిలోనే ఉంటే.. స్టోక్స్ డ్రాకు ఆఫర్ చేసేవాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే డ్రా ప్రతిపాదన లంచ్‌కు ముందో.. తర్వాతనో ఎందుకు తేలేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.