ఆ 1,950 మంది ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసిన అధికారులు.. సెక్రటరీలపై వేటు

Wait 5 sec.

ప్రభుత్వం పేదవారి సొంతింట కల సాకారం కోసం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. అవన్ని ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా . అధికారులు 1,950 మంది ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేశారు. ఆ వివరాలు.. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని చోట్ల అనర్హులకు ఇళ్లు దక్కుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న తప్పులతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 1,950 మంది అనర్హులు ఇందిరమ్మ ఇళ్లు పొందినట్లు వెల్లడైంది. బెస్‌మెంట్‌‌ పూర్తయిన తరువాత.. మొదటి విడతలో భాగంగా రూ. లక్ష చెల్లించే సమయంలో ఈ 1,950 మంది అనర్హులను గుర్తించారు. దీనిపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ.. వెంటనే వీరికి మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసి.. వీరికి బదులు కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన సెక్రటరీలను సస్పెండ్ చేశాలని తెలిపారు. ఈ పథకానికి సంబందించి మొదడి విడతలో.. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఏండీ గౌతమ్ తెలిపారు. అయితే తాజాగా చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన ఈ 1,950 మంది గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి.. బెస్‌‌మెంట్‌‌ వరకు నిర్మించి వదిలేసిన వారని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు వీరి ఫొటోలను యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేశారు. దశల వారీగా పలువురు అధికారులు.. ఆపై కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే .. లబ్ధిదారులకు బిల్లలు చెల్లిస్తున్నామని అన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల తప్పులు జరిగి.. అనర్హులు కూడా ఇళ్లు పొందారని వెల్లడించారు.రానున్న రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గౌతమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల గురించి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ మొబైల్ యాప్‌‌లో ఫొటో క్యాప్చర్‌‌ సమయంలో సెక్రటరీలు తప్పులు చేస్తున్నారని దీనిలో పేర్కొన్నారు. ఇందరిమ్మ ఇంటి నిర్మాణం 400-600 చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగాలని.. కచ్చితంగా రెండు రూమ్‌లు, కిచెన్, బాత్రూం నిర్మించాలని సూచించారు. పునాదికి ముందు వైపు, పక్కల వెంట,పై నుంచి ఫొటో తీసి అప్‌‌లోడ్‌‌ చేయాలని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దశల వారీగా హౌసింగ్ ఏఈలు తనిఖీ చేయాలని ఆదేశించారు.