HYD: మహిళ ప్రాణం తీసిన రిఫ్రిజిరేటర్‌ డోర్‌.. మీరూ అలాగే చేస్తున్నారా..?

Wait 5 sec.

హైదరాబాద్ జేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (జూలై 28) విషాదకర ఘటన చోటు చేసుకుంది. రిఫ్రిజిరేటర్ డోర్ ఓ మహిళ ప్రాణం తీసింది. గురై 40 ఏళ్ల మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ఎర్రబోడకు చెందిన లావణ్యకు ముగ్గురు కుమార్తెలు. భర్త పదేళ్ల క్రితం మృతి చెందగా.. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. గతేడాది తన పెద్ద కూతురి వివాహం చేసింది. కూతురికి ప్రసవం కాగా.. ఆమె ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంది. సోమవారం ఉదయం లావణ్య రిఫ్రిజిరేటర్‌ను తెరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేక వేసింది. ఆమెను కాపాడటానికి పెద్ద కూతురు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. స్థానికుల సహాయంతో లావణ్యను వెంటనే హైదర్‌గూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఫ్రిజ్‌కు ఎర్తింగ్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రిఫ్రిజిరేటర్ వాడకంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలురిఫ్రిజిరేటర్లు మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వాటిని సరిగ్గా నిర్వహించకపోతే విద్యుత్ షాక్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాలను నివారించడానికి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.మీ ఇంటిలోని ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్‌లో సరైన ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఎర్తింగ్ లేకపోతే లేదా సరిగా లేకపోతే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు షాక్ తగిలే ప్రమాదం ఎక్కువ. మీ ఇంట్లో ఎర్తింగ్ సరిగా ఉందో లేదో ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించుకోండి. దెబ్బతిన్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. వైర్లు కట్ అయినా.. ప్లగ్ వదులుగా ఉన్నా వెంటనే మార్చాలి.రిఫ్రిజిరేటర్ చుట్టూ, దాని ప్లగ్ పాయింట్ వద్ద నీరు లేదా తేమ లేకుండా చూసుకోవాలి. తడి చేతులతో రిఫ్రిజిరేటర్‌ను తాకవద్దు లేదా ప్లగ్‌ను తీయవద్దు. ఫ్రిజ్‌ను శుభ్రం చేసేటప్పుడు కూడా ప్లగ్‌ను తీసివేయండి.ఎప్పుడూ రిఫ్రిజిరేటర్ కోసం తగిన వోల్టేజ్, ఆంపియర్ రేటింగ్ ఉన్న పవర్ సాకెట్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌టెన్షన్ వైర్లు వాడటం వీలైనంత వరకు తగ్గించండి. తప్పనిసరి అయితే హెవీ-డ్యూటీ ఎక్స్‌టెన్షన్ వైర్లను మాత్రమే ఉపయోగించండి.ప్రతి సంవత్సరం ఒకసారి అర్హత కలిగిన టెక్నీషియన్‌తో రిఫ్రిజిరేటర్‌ను సర్వీసింగ్ చేయించడం మంచిది. ఇది ఏదైనా అంతర్గత వైరింగ్ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడంలో సహాయపడుతుంది.రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో ఉన్న కంప్రెషర్ లేదా వైరింగ్ వద్ద లోహపు వస్తువులు తగలకుండా చూసుకోండి.చిన్న పిల్లలు ఫ్రిజ్‌తో ఆడుకోకుండా లేదా దాని వైర్లను లాగకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.