Who Invented the ATM Machine & What isthe reason for ATM idea?(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏటీఎం మెషీన్‌నుఎవరు కనుగొన్నారు, అతను భారతదేశంలో జన్మించాడని మీకు తెలుసా & ఏటీఎం ఆలోచనకు కారణం ఏమిటి? ===================ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) మన రోజువారీజీవితాల్లో భాగమైపోయింది. డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిన ఈ కాలంలోనూ.. ఇవిలేని రోజుల్ని ఊహించడం కష్టం. అలాంటి ఈ మెషీన్ రూపొందించాలన్న ఆలోచన ఎలాపురుడుపోసుకుందన్నదీ ఆసక్తికరమే. 1967లో లండన్ లో తొలి ఏటీఎం ఏర్పాటైంది. బార్ క్లేస్ బ్యాంక్ బ్రాంచ్ బయట దీన్నిఏర్పాటు చేశారు. బ్రిటిష్ టీవీ నటుడు రెగ్ వార్నీ అప్పట్లో ప్రారంభించారు.తొలినాళ్లలో ఈ ఏటీఎం నుంచి గరిష్ఠంగా 10 పౌండ్లుమాత్రమే ఉపసంహరించుకోవడానికి వీలుండేది. క్యూలో గంటలు గంటలు నిల్చుని బ్యాంకులోనగదు ఉపసంహరించుకోవడంతో పోలిస్తే ఇది పెద్ద మొత్తమనే చెప్పాలి. జాన్ షెఫర్డ్బారన్ అనే వ్యక్తి ఈ ఏటీఎంను రూపొందించారు. లండన్ లోని ఓ బ్యాంకు వద్ద నగదు కోసంప్రజలు పోటీపడడాన్ని షెఫర్డ్ గమనించారు. నగదు అవసరమైనప్పుడు తాను వ్యక్తిగతంగాఇబ్బంది ఎదుర్కొన్నారు. తన స్వీయ అనుభవం బ్యాంకు గంటలకు మించి నగదును అందుబాటులోఉంచే యంత్రం గురించి ఆలోచించేలా చేసింది. ఈ క్రమంలో చాక్లెట్ బార్లను విక్రయించేవెండింగ్ మెషీన్ ఆయనకు గుర్తొకొచ్చింది. చాక్లెట్ల స్థానంలో నగదు ఎందుకుఉండకూడదన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచనతో 24/7 నగదు ఉపసంహరణకు అనుమతించే ఒక యంత్రాన్ని రూపొందించారు. అలా రూపుదిద్దుకున్నక్యాష్ మెషీనే.. నేడు ఏటీఎంగా మారింది.ఇంకో విషయంఏంటటే స్కాట్లాండ్ కు చెందిన జాన్ షెఫర్డ్బారన్ పుట్టింది భారత్లోనే. ఆయన తల్లిదండ్రులు బ్రిటిషర్లు. ఉద్యోగరీత్యా ఆయనతండ్రి బ్రిటిష్ ఇండియాలో విధులు నిర్వర్తించారు. 1925 జూన్ 23న నేటి మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోషెఫర్డ్ జన్మించారు. ఆయన జ్ఞాపకార్థం ఆస్పత్రి వెలుపల 2021 ఆగస్టులో ఎస్బీఐ ఓ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.భారత్లోఏటీఎం ప్రస్థానం 1987లో ప్రారంభమైంది.ముంబయిలో హెచ్ఎస్ బీసీ బ్యాంకు శాఖలో తొలి ఏటీఎం ఏర్పాటైంది. భారత బ్యాంకింగ్వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఇక్కడే ప్రారంభమైంది. తర్వాతి కాలంలో దేశవ్యాప్తంగావేగంగా విస్తరించాయి. 1999 నాటికి దేశంలోకేవలం 800 ఏటీఎంలు ఉండగా.. 2024 నాటికిఆ సంఖ్య 2 లక్షల పైమాటేతొలినాళ్లలో కేవలం నగదు విశ్రాకు మాత్రమే పనికొచ్చిన ఈ ఏటీఎంలు అకౌంట్ బ్యాలెన్స్తెలుసుకోవడం, స్టేట్మెంట్, పిన్ జనరేషన్, కార్డు లెస్విత్ వంటి సేవలను అందిస్తున్నాయి.===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});