భూముల వేలానికి సిద్ధమైన ప్రభుత్వం.. అక్కడ ఎకరం రూ.104 కోట్లు..!

Wait 5 sec.

తెలంగాణలో.. అందునా హైదరాబాద్‌లో అంటే.. ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తారు. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు పోటీగా భాగ్యనగరంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. తెలంగాణ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్రాంతంలో ఎకరం ధర గరిష్టంగా 100 కోట్ల రూపాయలకు పైగానే పలికి.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా . ఈ క్రమంలో ఓ ప్రాంతలో ఎకరా ధర గరిష్టంగా 104 కోట్ల రూపాయలు పలికి కోకాపేట్‌ను తలదన్నేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం.. మొత్తం 66 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) ద్వారా విక్రయించేందుకు రెడీ అవుతోంది. మొత్తం 17 ప్లాట్లను వేలం వేయాలని భావిస్తుండగా.. దీనిలో 4 ప్లాట్లు రాయదుర్గంలో, మరో 13 ప్లాట్లు ఉస్మాన్ సాగర్‌లో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే టీజీఐఐసీ.. మొత్తం 66 ఎకరాల భూమి అమ్మకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచింది. ఈభూముల విక్రయానికి సంబంధించి టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు సమయం ఇచ్చిందే. నాలుగు రోజుల తర్వాత అనగా ఆగస్ట్ 12 న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు. ప్లాట్ల వివరాలు, భూముల ధరలువేలం వేయడానికి నిర్ణయించిన , ఉస్మాన్ సాగర్‌లోని పలు ప్లాట్ల మార్కెట్ ధరలను టీజీఐఐసీ ఖరారు చేసింది. ఈక్రమంలో రాయదుర్గంలోని 15ఏ/2 ప్లాట్‌కి అత్యధికంగా 71.60 కోట్ల రూపాయల మార్కెట్ ధర ఉన్నట్టు టీజీఐఐసీ వెల్లడించింది. అక్కడ కనీస ధరను (అప్‌సెట్ ప్రైస్) రూ. 50.10 కోట్లుగా టీజీఐఐసీ నిర్ధారించింది. ఇక్కడ మొత్తం 7. 67 ఎకరాలను వేలం వేయనున్నారు. దీంతోపాటు ఇదే రాయదుర్గంలోని ప్లాట్ 19 మార్కెట్ ధర రూ. 66.30 కోట్లు ఉండగా.. అప్‌సెట్ ప్రైస్‌ను రూ.44.30 కోట్లుగా నిర్ధారించింది. మొత్తం ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 11 ఎకరాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.ఇదిలా ఉంటే రాయదుర్గంలోని 14ఏ/1, 14బీ/1, ప్లాట్ల మార్కెట్ ధరను.. చదరపు గజానికి రూ.2,16,405 గా ప్రకటించారు. అంటే ఈ రెండు చోట్ల ఎకరం భూమి ధర గరిష్టంగా రూ.104.74 కోట్లు పలుకుతుందన్నమాట. ఈ 2 ప్లాట్ల అప్‌సెట్ ప్రైస్‌ను చదరపు గజానికి రూ.1,51,484 అంటే ఎకరానికి రూ.73.32 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ వేలంలో రాయదుర్గంలో 19. 67 ఎకరాలను విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.వీటితో పాటుగా ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న 1 నుంచి 15 వరకు ప్లాట్లలో.. 8, 10 మినహా మిగతా ప్లాట్ల వేలానికి అధికారులు నిర్ణయించారు. ఇక్కడ మార్కెట్ ధర.. ప్లాట్‌ను బట్టి రూ.18.70 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా నిర్ధారించారు. రాయదుర్గంలోని 14బీ/1, 14ఏ/1 ప్లాట్ల మార్కెట్ ధర కోకాపేట్‌ను మించిపోయేలా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ భూముల వేలం ఏలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూాడాలి.