డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

Wait 5 sec.

in AP: మహిళలు ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడేలా, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే సాధికారత సాధ్యమని విశ్వసిస్తున్న ప్రభుత్వం.. ఆ క్రమంలోనే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు, వీధి వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పట్టణాలలో కొత్తగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. స్వయం సహాయక సంఘాలలోని మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.* స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు.. అంటే ఏమిటి?సాధారణంగా మనం బజారుకు వెళ్లినప్పుడు ఒక్కో వస్తువును ఒక్కోచోట కొనుగోలు చేయాల్సి వస్తుంది. నగరాలలో అయితే డీమార్టులు, షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉంటాయి. అదే పట్టణాలలో అయితే మధ్య తరగతి కుటుంబం మొదటగా వెళ్లేది బజారుకే.. నాణ్యమైన వస్తువులు అందుబాటు ధరలో ఎక్కడ దొరుకుతాయా అని ఒకటికి రెండుసార్లు గాలించి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ బాధలు తప్పించేలా ప్రభుత్వం ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఆలోచన చేస్తోంది.*ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌లో ఇంట్లోకి అవసరమైన వస్తువులు అన్నీ కూడా ఒకేచోట లభిస్తాయి. ఒకేచోట కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చు. ఏపీలో ఎనిమిదిచోట్ల ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటు వలన వినియోగదారులకు సమయం ఆదా కావటంతో పాటుగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు, వీధి వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు.. ఏమేం ఉంటాయి?స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అంటే 200 నుంచి 250 మంది ఒకేచోట వ్యాపారాలు చేసుకునే చోటు. వ్యాపారాలు చేసుకునేందుకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్ షాపులు ఏర్పాటు చేస్తారు. ప్లగ్‌అండ్‌ప్లే విధానంలో వీటిని వాడుకోవచ్చు. అలాగే ఈ కంటైనర్‌పైన సోలార్‌ ప్యానెల్స్ ఏర్పాటుచేసి వాటి ద్వారా షాపు అవసరాలకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. *స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లలో నిత్యావసరాల నుంచి కాయగూరల వరకూ అన్నీ అందుబాటులో ఉంటాయి. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవారు, స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు వీటిని కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లలో కేటాయించే షాపుల నుంచి వసూలు చేసే అద్దెలు, ప్రకటనల ఆదాయంతో వీటిని నిర్వహించనున్నారు.