ఆగస్టు 2న అరుదైన సూర్యగ్రహణం.. ప్రపంచం మొత్తం పట్టపగలే చీకట్లు? ప్రచారంపై నాసా క్లారిటీ

Wait 5 sec.

‘ఆగస్టు 2న ’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. వైరల్‌గా మారిన ఈ వార్తలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పందించింది. ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమని, అందులో ఎటువంటి నిజం లేదని నాసా అధికారికంగా ప్రకటించింది. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఆగస్టు 2, 2025 న ఎలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించదు. అంతేగాక, ఆ రోజున సూర్య గ్రహణం అనేది లేనేలేదు. ‘ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్తుంది’ అని సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తం’ అని పేర్కొంది. అంతేకాదు, ఎప్పుడు ఏర్పడుతుందనేది దానిపై కూడా క్లారిటి ఇచ్చింది.సూర్యగ్రహణంఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం 2025 సెప్టెంబర్ 21న సంభవిస్తుందని, ఇది పాక్షిక గ్రహణమని తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించదని పేర్కొంది. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపించనుంది. ఉత్తర అమెరికా సహా ఇతర ఖండాల్లో దీని ప్రభావం ఉండదు. ఇదిలా ఉండగా, సంపూర్ణ సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న జరగనుంది. ఇది 6 నిమిషాలు 23 సెకన్ల పాటు కొనసాగనుంది. భూమిపై ఈ శతాబ్దంలో ఇదే పొడవైన గ్రహణం కావడం విశేషం. అందుకే దీనిని ‘శతాబ్దపు గ్రహణం’గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.2027 గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?స్పెయిన్, జిబ్రాల్టార్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా ప్రాంతాల్లోని ప్రజలకు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా కనిపించదు.ఈ గ్రహణం ఇంత పొడవుగా ఉండటానికి మూడు కారణాలు ఉన్నాయి. భూమి అప్పటికి అపోజీ దగ్గర (అంటే సూర్యునికి అత్యంత దూరంగా ఉంటుంది), అందువల్ల సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు. చంద్రుడు పెరిజీ దగ్గర (భూమికి అత్యంత సమీపంలో) ఉంటాడు కనుక పెద్దగా కనిపిస్తుంది. గ్రహణ మార్గం భూమి ఈక్వేటర్‌ (0 డిగ్రీ అక్షాంశం) దగ్గరగా ఉంటుంది, అక్కడ చంద్రుని నీడ నెమ్మదిగా కదులుతుంది. ఈ మూడు కారణాల వల్ల పొడవైన గ్రహణం ఏర్పడుతుంది..సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఇది కొన్ని నిమిషాలపాటు కొనసాగినా.. ఆ సమయంలో గ్రహణం కనిపించిన ప్రదేశం చీకటిగా మారిపోవడం, సూర్యుని బయటి ప్రాంతం కరోనా మబ్బు పట్టినట్టు అనిపిస్తుంది. అలాగే, 1991 తరువాత ఈ స్థాయిలో పొడవైన గ్రహణం ఏర్పడటం ఇదే మొదటిసారి. తర్వాత ఇటువంటి గ్రహణం 2100 తర్వాతే జరగొచ్చు. అందుకే ఇది ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు జీవితకాలంలో ఒక అవకాశం.