ITR-3 ఆన్‌లైన్ ఫారం విడుదల.. మరి ఎవరెవరు ఫైల్ చేయాలి? ఫుల్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరో బిగ్ న్యూస్. ఆన్‌లైన్ ఐటీఆర్ 3 ఫారం అందుబాటులోకి వచ్చింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించినప్పటికీ ఇన్ని రోజులు ఈ ఫారం విడుదల చేయకపోవడంతో చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా వారందరికీ ఊరట లభించినట్లయింది. ఐ ఈ క్రమంలో ఈ ఫారం ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి ఆదాయాలు ఉన్న వారికి వర్తిస్తుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న వారు, సొంత బిజినెస్ కలిగి ఉన్న వారు ఆన్‌లైన్‌లో రిటర్నులు ఫైల్ చేసేందుకు ఐటీఆర్-3 ఉపయోగించాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులు, ఏదైనా కంపెనీలో భాగస్వామిగా ఉన్న వారు, విదేశీ ఆస్తుల నుంచి క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్న వారు, అద్దె ఆదాయం ఉన్న వారు, ఎన్ఎస్ఈ వంటి అన్‌లిస్టెడ్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు ఈ ఐటీఆర్ 3 ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. సింపు‌ల్‌గా చెప్పాలంటే ఐటీఆర్ ఫారాలు 1, 2, 4 వర్తించని వారు ఐటీఆర్ 3 ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి ఐటీ శాఖ ఈసారి కీలక మార్పులు చేసింది. దీంతో ఐటీఆర్ ఫారాలను చాలా ఆలస్యంగా విడుదల చేస్తోంది. సాధారణంగా ఏప్రిల్ తొలి వారంలోనే రావాల్సిన ఫారాలు, యుటిలిటీలు మే చివరి వరకు విడుదల కాలేదు. దీంతో ఈసారి అకౌంట్లు ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆన్‌లైన్ ఫైలింగ్ మొదలైంది. ఐటీఆర్ 1, 2, 4 ఆన్‌లైన్ ఫారాలు, యుటిలిటీలను విడుదల చేయగా తాజగా ఐటీఆర్ 3ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. గడువు దగ్గర పడే వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా ఐటీ రిటర్నులు పూర్తి చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వెరిఫికేషన్ చేసేందుకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ఏవైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకోవచ్చు. మరోవైపు.. జూలై 29, 2025 వరకు 2.10 కోట్ల ఐటీ రిటర్నులు ఫైల్ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 2.03 కోట్ల రిటర్నులు వెరిఫై అయ్యాయని తెలిపింది. వాటిల్లో 1.13 కోట్ల రిటర్నులను ప్రాసెస్ చేసి రీఫండ్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.