పాదరసంతో బంగారం తయారీ.. స్టార్టప్ కంపెనీ సంచలనం, ఇక పసిడి ధరలు పడిపోనున్నాయా?

Wait 5 sec.

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి తెగ డిమాండ్ ఉంటుంది. పసిడిని ఒక లోహంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక భద్రతగానూ, సామాజిక హోదా పరంగా, తరతరాల ఆస్తిగా కొనసాగుతోంది. ఇక పసిడికి మన దేశంలో మరింత క్రేజ్ ఉంటుంది. మహిళలు మాత్రమే కాకుండా పురుషులు, చిన్న పిల్లలకు కూడా బంగారు ఆభరణాలపై అమితాసక్తి ఉంటుంది. మరోవైపు.. రోజురోజుకూ .. ఆకాశాన్నంటుతుండటంతో పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లకు బంగారాన్ని కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. ఇలా ఆధ్యాత్మిక పరంగానూ భారతదేశంలో బంగారానికి కీలక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంది. అయినప్పటికీ బంగారం ధర మాత్రం తగ్గడం సంగతి పక్కనపెడితే.. రోజు రోజుకూ మరింత ప్రియం అవుతోంది. ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ చేసిన సంచలన ప్రకటన.. ఇప్పుడు యావత్ ప్రపంచదేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాదరసం (మెర్క్యూరీ) నుంచి బంగారం తయారు చేయవచ్చని.. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అనే స్టార్టప్ సంస్థ.. కీలక ప్రకటన చేసింది. ఫ్యూజన్ శక్తి ప్రక్రియ ద్వారా.. పసిడిని తయారు చేయవచ్చని చెబుతోంది. పాదరసంను బంగారంగా మార్చే టెక్నాలజీని తాము డెవలప్ చేశామని తెలిపింది. ఒకవేళ ఈ ప్రయోగాలు సక్సెస్ అయి కార్యరూపం దాల్చితే.. భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. ఏడాదికి 5 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. మూలకాల ప్రోటాన్ల తొలగింపున్యూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్ (మూలకాల మార్పిడి) అనే ప్రక్రియ ద్వారా మెర్క్యూరీ నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చని మారథాన్ ఫ్యూజన్ సంస్థ తెలిపింది. ఇది అణు సంలీన (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియలో ఒక భాగమని వెల్లడించింది. మూలకం అణువులోని ప్రోటాన్లను తొలగించడం ద్వారా ఆ మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియనే న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్. ఈ ప్రక్రియను ఉపయోగించి పాదరసరం మూలకంలోని ప్రోటాన్లను తొలగించి.. దాని నుంచి బంగారంగా మార్చవచ్చని పేర్కొంది. పాదరసం (మెర్క్యూరీ) నుంచి బంగారం తయారీ ఎలా?పాదరసం-198 అనే ఐసోటోప్‌ను ఫ్యూజన్ రియాక్టర్‌లోకి ప్రవేశపెడతారు. అది మొదట పాదరసం-197 గా మారుతుంది. పాదరసం-197 అనేది ఒక అస్థిరమైన ఐసోటోప్. ఇది దాదాపు 64 గంటల తర్వాత క్రమంగా క్షీణించి బంగారం-197 ఐసోటోప్‌గా రూపాంతరం చెందుతుందని ఆ సంస్థ చెబుతోంది. బంగారం-197 అనేది బంగారం స్థిరమైన ఐసోటోప్. ఇక ఈ ప్రక్రియ హైడ్రోజన్ ఐసోటోపులు (డ్యూటెరియం, ట్రిటియం) కలయిక నుంచి విడుదలయ్యే అధిక శక్తి న్యూట్రాన్ల స్థిరమైన విడుదలపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.బంగారం ఉత్పత్తి సామర్థ్యంఒక గిగావాట్ థర్మల్ పవర్‌కు ఒక ఏడాదిలో దాదాపు 5 వేల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని మారథాన్ ఫ్యూజన్ సంస్థ సీటీఓ ఆడమ్ రుట్కోవ్స్కీ, సీఈఓ కైల్ షిల్లర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రక్రియ ఆ థర్మల్ పవర్ ప్లాంట్ మొత్తం విద్యుత్ ఉత్పత్తిని ప్రభావితం చేయదని.. బంగారాన్ని ఒక అదనపు ఉప ఉత్పత్తిగా మాత్రమే పొందవచ్చని చెబుతోంది. ఈ ప్రక్రియలో బంగారాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వచ్చే విలువ.. ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ విలువకు సమానం కావచ్చని మారథాన్ ఫ్యూజన్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మెర్క్యూరీ బంగారంతో సవాళ్లున్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియలో తయారు చేసేది స్వచ్ఛమైన బంగారమే అయినప్పటికీ.. ఫ్యూజన్ రియాక్టర్‌ను ఉపయోగించడం వల్ల 14 నుంచి 18 ఏళ్ల వరకు ఆ బంగారంలో రేడియోధార్మికత ఉండే ప్రమాదం ఉందని అంచనా వేసింది. దాని వల్ల ఆ బంగారాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించేందుకు అవకాశం ఉండదని తెలిపింది. ప్రపంచ దేశాల్లో ఉన్న సైంటిస్ట్‌లు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి ఉత్పత్తిపై గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నప్పటికీ.. ఇంకా వాణిజ్యపరంగా ఆచరణలోకి వచ్చేంత స్థాయికి చేరుకోలేదు. మారథాన్ ఫ్యూజన్ సంస్థ గత 3 ఏళ్లుగా దాదాపు 6 మిలియన్ డాలర్ల పెట్టుబడులను.. 4 మిలియన్ డాలర్ల ప్రభుత్వ గ్రాంట్లను పొందింది.పాదరసం నుంచి పసిడిని ఉత్పత్తి చేయడం అనేది సూత్రప్రాయంగా సాధ్యంగానే కనిపిస్తున్నప్పటికీ.. అది సాధారణ రసాయనిక పద్ధతులతో సాధ్యం కాదని.. కేవలం అణు స్థాయిలోనే సాధ్యపడుతుందని తెలుస్తోంది. ఈ ప్రయోగం ప్రాథమిక స్థాయిలో విజయవంతమైందని చెప్పిన మారథాన్ ఫ్యూజన్ సంస్థ.. ఇది వాణిజ్యపరంగా ఉపయోగపడటానికి ఇంకా మరిన్ని పరిశోధనలు, భారీ పెట్టుబడులు కావాల్సి ఉందని స్పష్టం చేసింది.మరో కంపెనీ పరిశోధనలుఅమెరికా సిలికాన్ వ్యాలీలోని EonAlchemy Inc అనే ఇంకో సంస్థ కూడా పాదరసం (Hg-196, Hg-198) ఐసోటోప్‌లను బంగారం స్థిరమైన ఐసోటోప్‌లుగా (Au-197) మార్చడానికి పరిశోధనలు చేస్తున్నట్లు జూలై 26వ తేదీన ప్రకటించింది. దీనికి పేటెంట్ పొందేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తానికి ఈ పరిశోధనలు అన్నీ విజయవంతంగా పూర్తి అయితే.. భవిష్యత్తులో బంగారం కోసం కేవలం గనులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తప్పనుంది. అంతేకాకుండా బంగారం ఉత్పత్తి కూడా మరింత పెరగనుంది. అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైనదని.. అధిక శక్తి అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ఆర్థికంగా లాభం చేకూర్చుతుందా అనేది ప్రశ్నగానే మిగిలింది. పాదరసం నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయడం ఇప్పటివరకు కేవలం సైన్స్ ఫిక్షన్లలో మాత్రమే కనిపించగా.. తాజా పరిశోధనలతో అది ముందడుగు పడినట్లయింది. అన్నీ అనుకున్నట్లే జరిగి.. మరిన్ని పరిశోధనల్లో మెర్క్యూరీని బంగారంగా మార్చగలిగితే.. బంగారం ధరలు దిగివస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా జరగాలని మనం కూడా ఆశిద్దాం.