Income tax: ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అని రెండు ఉన్నాయి. తమకు ఏది సరిపోతుందనేది తేల్చుకుని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, మన దేశంలో చాలా మంది నెలకు రూ.10, రూ.15, రూ.20 వేలలోపే సంపాదిస్తున్నారు. చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారందరికీ సాధారణంగా ఓ ప్రశ్న మెదులుతుంటుంది. మీరు ఏడాదికి రూ.2.50 లక్షలు సంపాదిస్తుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. పాత పన్ను విధానంలో 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.2.50 లక్షల లోపు సంపాదిస్తుంటే ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. వారు ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి అవసరం లేదు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇక కొత్త పన్ను విధానానికి వస్తే రూ.3 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. వారు కూడా ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయాల్సినక్కర్లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. రూ.2.50 లక్షలలోపు ఉన్నా వీరు ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలి మీరు కరెంట్ అకౌంట్లో రూ.1 కోటికి పైగా డిపాజిట్ చేసినప్పుడువిదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పుడుమీ ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ (TDS)అనేది రూ.25 వేలకు పైగా (60 ఏళ్లు దాటిన వారికి రూ.50 వేలు) ఉన్నప్పుడుమీకు విదేశాల్లో ఆస్తులు ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఐటీ రిటర్నులు ఫైల్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు లేదా వీసా అప్రూవల్ కోసం ఉపయోగపడుతుంది. బ్యాంకులు, ఎంబసీలు ఐటీఆర్ అడుగుతాయి. పర్సనల లోన్స్, వీసా జారీ కోసం ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే మీ క్యాపిటల్ లేదా బిజినెస్ నష్టాలను వచ్చే ఏడాదికి బదిలీ చేయవచ్చు. అందుకు మీ ఐటీ రిటర్నులు ఉండాలి. అప్పుడే వచ్చే ఏడాదిలో వచ్చే లాభాలతో ప్రస్తుత ఏడాది నష్టాలను భర్తీ చేయవచ్చు. అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ట్యాక్స్ అథారిటీలతో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉండవచ్చు. మీ ఆదాయానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది.