Annadata Sukhibhava Ekyc and NPCI Mapping: ఏపీలోని రైతులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆగస్ట్ రెండో తేదీన నిధులు జమ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ అంశం మీద మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఆర్దికంగా చేయూతను అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20 వేలు అందిస్తున్నట్లు వివరించారు.అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. రైతు సేవా కేంద్రాలలో ఈ- కేవైసీ, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాలు పెండింగ్‌లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సీసీఆర్సీ కార్డు కలిగిన కౌలు రైతులు ఈ- క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని.. వారికి అక్టోబర్ నెలలో ఇచ్చే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన నిధులు వస్తాయని సీఎస్ విజయానంద్ వివరించారు. వెబ్ ల్యాండ్, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ- కేవైసీ తప్పనిసరి అని.. వారికి ఆగస్టు 2వ తేదీన నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కాని రైతులకు ఆర్టీజిఎస్ ద్వారా ఎస్ఎంఎస్ పంపాలని ఆర్టీజిఎస్ అధికారులను ఆదేశించారు. గా గుర్తించిన వారిని.. ఎందుకు తిరస్కరించారనే దానిపై రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాలు అందించాలని.. అలాగే తిరస్కరణకు గురైన వారి వివరాలను మరోసారి పరిశీలించి.. ఆగస్ట్ ఒకటో తేదీలోగా అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని విజయానంద్ అధికారులను ఆదేశించారు. భూమి మ్యుటేషన్ ప్రక్రియ, ఆధార్ సీడింగ్ సరిగా కాకపోవడం, చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.