హరిద్వార్‌లో తీవ్ర విషాదం.. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

Wait 5 sec.

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రావణమాసం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.