దుర్గగుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే

Wait 5 sec.

చాలా మంది భక్తులు.. తిరుమల శ్రీవారి ఆలయం సేవ చేయడానికి తరలి వస్తుంటారు. ఇప్పటి వరకు కేవలం తిరుపతిలోనే ఉన్న ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో ఆలయ అధికారులు దుర్గమ్మకు సేవ చేయాలని భావించే భక్తులు, సేవా బృందాలకు అవకాశం కల్పించారు. దుర్గమ్మకు సేవా చేయాలని ఆసక్తి ఉన్న భక్తులు దరఖాస్తు చేసుకోవడం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. .. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిస్వార్థంగా ఉచిత సేవ చేసే.. సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. వారి సేవలు వినియోగించుకునేందుకు ఆలయ అధికారులు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దుర్గమ్మ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులను.. భక్తులుకు మంచి నీరు, అన్న ప్రసాద వితరణ, ఉచిత ప్రసాద పంపిణీ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, సెల్‌ఫోన్లు, లగేజ్ భద్రపరిచే రూమ్, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, భక్తుల ఫీడ్ బ్యాక్ కౌంటర్, దేవస్థానం బస్ క్యూ, పార్కింగ్, లిప్ట్ క్యూ, టోల్ గేట్ వద్ద వాహనాలు కంట్రోల్ వంటి చోట్ల.. ఆలయ అధికారులు వారి సేవలు వినియోగించుకోనున్నారు. దుర్గమ్మ సేవకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. మొదటగా దేవస్థానం వెబ్‌సైట్ లో వాలంటీర్ విభాగంలోకి వెళ్లి వాలంటీర్‌గా జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత వారి పేరు, ఫోన్ నెంబర్, ఆధార్, అడ్రెస్, ఫోటోతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులకు సేవ కేటాయింపు, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, వారికి తాత్కాలిక గుర్తింపు కార్డు అలానే వారినికి వసతి నుంచి దేవాలయం దగ్గరకు కల్పించే రవాణా సౌకర్యం గురించిన అన్ని వివరాలను.. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ రూపంలో అందేలా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తి భావంతో పాటు అమ్మ వారికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులను ఇందుకోసం వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఉచిత వసతి, భోజనం ఏర్పాటుతో పాటుగా వారితో సేవ చేయించాల్సిన ప్రదేశాలకు దేవస్థానం వాహనాల్లోనే వారిని తీసుకెళ్తారు. అలాగే వారి సేవాకాలం పూర్తయిన తర్వాత అమ్మవారి దర్శనం చేయించి.. ప్రసాదం అందజేస్తారు. వీటితో పాటుగా దుర్గమ్మ సేవ చేసిన వారికి సామూహిక వేద ఆశీర్వచనం కూడా ఇప్పిస్తారు. రోజుకు 200 మంది సేవలో పాల్గొనేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మకు సేవా చేయాలనే ఆసక్తి ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.