షిరిడి వెళ్లే వారికి తీపికబురు.. తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ మీదుగా.. పూర్తి వివరాలివే..

Wait 5 sec.

: రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాలైన తిరుపతి, మధ్య నడిచే రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని అధికంగా ఉంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని షిరిడీ మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ తిరుపతి షిరిడి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ 29 వరకూ తిరుపతి సాయినగర్ షిరిడి మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. ఆగస్ట్ మూడో తేదీ నుంచి 07637 నంబర్‌తో తిరుపతి సాయినగర్ షిరిడి రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం ఉదయం నాలుగు గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌లో బయల్దేరే తిరుపతి - షిరిడి ప్రత్యేక రైలు.. రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు రైల్వేస్టేషన్, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భల్కి, ఉద్గిర్ రైల్వేస్టేషన్, లాతూర్ రోడ్, పర్లి, గంగాఖేర్, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్ స్టేషన్, నాగరసోల్, మన్మడ్, కోపర్‌గావ్ రైల్వేస్టేషన్ల మీదుగా సాయినగర్ షిరిడికి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ 28 వరకూ ప్రతి ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మరోవైపు 07638 నంబర్‌‍తో సాయినగర్ షిరిడీ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఆగస్ట్ నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకూ ప్రతి సోమవారం రాత్రి 7 గంటల 35 నిమిషాలకు షిరిడి తిరుపతి ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి 7:35 గంటలకు షిరిడిలో బయల్దేరే ఈ ప్రత్యేక రైలు.. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట 30 నిమిషాలకు తిరుపతి రైల్వే్స్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి సాయినగర్ షిరిడి ప్రత్యేక రైళ్లల్లో.. ఏసీ టూటైర్, ఏసీ త్రీటైర్ క్లాసులతో పాటుగా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు కూడా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.