తిరుమల శ్రీవారి మహిళా భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్కోండి

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు, ముఖ్యంగా మహిళలకు టీటీడీ అద్భుత అవకాశం కల్పించింది. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘ‌నంగా నిర్వహించ‌నున్నారు. ఆగ‌స్టు 8వ తేదీ (శుక్రవారం) ఆలయంలోని ఆస్థానమండపంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేయ‌నుంది.లో భ‌క్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది టీటీడీ. దీని కోసం భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనుంది. జులై 31న (గురువారం) ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది. అంతేకాదు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు జారీ చేస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యం సమీపంలో ఉన్న కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఆగ‌స్టు 7న ఉదయం 9 గంటలకు 150 టికెట్లు విక్రయిస్తారు. ఈ మేరకు భక్తులు రూ.1000/- చెల్లించి వ్రతానికి సంబంధించిన టికెట్‌ కొనుగోలు చేయొచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారని టీటీడీ తెలిపింది. ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శనం, అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, వేద ఆశీర్వచ‌నం సేవలను రద్దు చేసింది . ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తోందిటీటీడీ.'హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన శ్రీమతి టి.సునీత దేవి, శ్రీ టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలను మంగళవారం తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారిపై అపారమైన భక్తితో తమ ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని దాతలను అదనపు ఈవో అభినందించారు' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ‌అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణలో భాగంగా చేపట్టిన బాలాలయంకు మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఇవాళ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.జులై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.