Fall: భారత్‌లో బంగారానికి మస్త్ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేస్తుంటారు. విదేశాల నుంచే భారీగా దిగుమతి అవుతుంటుంది. ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారీగానే బంగారం కొనుగోలు చేసింది. ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో పసిడి గిరాకీ గణనీయంగా ఉంటుంది. అయితే, ఈ 2025 ప్రారంభం నుంచి భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. ఇక పెళ్లి అంటే బంగారం కచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధర ఎంతైనా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు వరుసగా పడిపోతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ తులం రేటు మళ్లీ లక్ష రూపాయల దిగువకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో జూలై 30వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం రోజు భారీగానే తగ్గిన ఇవాళ మళ్లీ పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 17.63 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 3330 డాలర్లకు చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.39 శాతం పెరిగి 38.23 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక భారత కరెన్సీ రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూ.87.055 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం ధరహైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం రోజుల్లో తులం రేటు రూ.2600 మేర దిగివచ్చింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులంపై రూ. 110 మేర తగ్గడంతో 10 గ్రాములకు రూ.99 వేల 820 వద్దకు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.100 తగ్గింది. దీంతో తులం రేటు రూ. 91 వేల 500 వద్దకు దిగివచ్చింది. స్థిరంగానే వెండి రేటు.. మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,26,000 వద్ద ఉంది. అయితే, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,16,000 స్థాయిలో ఉంది.గమనిక: ఈ కథనంలో చెప్పిన బంగారం, వెండి రేట్లు జూలై 30 బుధవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే మధ్యాహ్నానికి గోల్డ్ రేట్లలో మార్పు రావచ్చు. ప్రాంతాలను బట్టి పన్నులు వేరు వేరుగా ఉండి ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. కొనే ముందే స్థానిక ధరలు తెలుసుకోవడం మంచిది.