దెబ్బకొట్టిన ట్రంప్.. 'బంగారం' ధరల్లో ఊహించని మార్పు.. ఒక్కరోజులో ఇలా.. నేటి రేట్లు ఇవే..!

Wait 5 sec.

Gold Rate Today: గత వారం రోజుల నుంచి తగ్గాయి. దీంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. ఇంకా తగ్గుతాయని భావించిన వారికి సడెన్ షాకిస్తూ ఒక్కసారిగా పెరిగాయి. తులం రేటు మళ్లీ లక్ష మార్క్ దాటింది. అలాగే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారానికి క్రమంగా గిరాకీ పెరుగుతుండడమూ ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్‌పై సుంకాల విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ధరలు పెరిగినట్లు మరికొంత మంది చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 31వ తేదీన బంగారం ధరలు ఏ స్థాయిలో ట్రేడవుతున్నాయో తెలుసుకుందాం. అక్కడ తగ్గిన బంగారం ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇవాళ ఔన్సుకు 40 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 3287 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఇవాళ 2.66 శాతం మేర పడిపోయింది. దీంతో ఇవాళ్టి రేటు ఔన్సుకు 37.13 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత వారం రోజులుగా 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులంపై రూ.2600 మేర పడిపోయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ. 1,00,480 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ రేటు తులానికి రూ.600 మేర పెరిగి రూ. 92 వేల 100 వద్దకు ఎగబాకింది. రూ.1000 పెరిగిన వెండి ధరహైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు మళ్లీ పెరిగింది. ఇవాళ కిలోకు రూ.1000 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,27,000 వద్దకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర రికార్డ్ స్థాయిలో ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి సిటీల్లో కిలో వెండి రూ.1,17,000 లకే లభిస్తోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జూలై 31వ తేదీన గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి మారుతుంటాయి. జీఎస్టీ వంటి ట్యాక్స్ లెక్కలోకి తీసుకుంటే పసిడి ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రాంతాల వారీగా మారుతుంటాయి. అందుకే కొనేముందు స్థానికంగా ఉండే రేట్లు తెలుసుకోవాలి.