తిరుమలలో ఆ రూల్ కఠినంగా అమలు.. శ్రీవారి భక్తులు ఈ విషయం తెలుసుకోండి

Wait 5 sec.

'తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలను, తద్వారా ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఘాట్‌ రోడ్లలో వాహనాలు.. తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణపై పాల‌సీ డాక్యుమెంట్‌ సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం స‌మావేశ మందిరంలో ట్రాన్స్‌పోర్ట్‌, అటవీ, విజిలెన్స్‌, ఆర్టీఏ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శేషా రెడ్డి, టీటీడీ డిప్యూటీ సీఎఫ్‌ ఫణికుమార్ నాయుడు, విజిలెన్స్‌ అధికారులు రామ్‌కుమార్‌, సురేంద్ర, జిల్లా రవాణా అధికారి కె. మురళి మోహన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో ట్రాఫిక్‌ను నియంత్రణ‌కు తీసుకోవాల్సిన చర్యలపై ఆయ‌న స‌మీక్షించారు' అని తెలిపింది.'పాల‌సీ డాక్యుమెంట్ లో ఈవీ పాలసీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను బలోపేతం చేయడం, ప్రైవేట్‌ జీప్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు. అలాగే తిరుమలలో ప్రీపెయిడ్‌ టాక్సీ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం గుర్తించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కనీస, గరిష్ట ఛార్జీలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు' అని ప్రకటనను విడుదల చేశారు.శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ అక్రిడిటేషన్టీటీడీ ఆధ్వర్యంలో తిరుప‌తిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవ‌త్సరం వ‌ర‌కు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్.బి.ఏ) మంజూరు చేసింది. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమిష్టి కృషితో పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అక్రెడిటేషన్ మంజూరు అయ్యేలా పనిచేశారని అభినందించారు టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టించి జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని, మరింత నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గడవు ముగియడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు గ‌త నెల‌లో కళాశాలలో ఇన్ స్పెక్షన్ నిర్వహించి 2028 వ‌ర‌కు అక్రిడిటేషన్ ఇచ్చారు. గ‌త నెల‌లో న్యూఢిల్లీ నుండి విచ్చేసిన ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ, బోధన తదితర అంశాలపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్.బి.ఏ మంజూరు అయింది.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 6వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 8నుండి 9.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.39 నుండి 10.30 గంటల వరకు బంగారు వాకిలి చెంత స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.