ఏపీలో విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు, పూర్తి వివరాలివే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ విద్యార్థులకు తీపికబురు చెప్పారు. ముస్లిం విద్యార్థుల కోసం నూతన ఉచిత విద్యా పథకాన్ని ప్రారంభించబోతున్నామని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 500 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. రెసిడెన్షియల్‌తో కూడిన ను ఉచితంగా అందిస్తామని.. అలాగే ఐఏఎస్‌ కోచింగ్‌ను కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ మేరకు ఆ 500మంది ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతో పాటుగా JEE, NEET కోచింగ్ కూడా ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు పదో తరగతి పాసైన విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు.. అందులో మంచి మెరిట్ సాధించిన విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు.. వారికి కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు అయ్యే ఖర్చు మొత్తం వక్ఫ్ బోర్డు భరిస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు. విజయవాడలోని కార్యాలయంలో వక్ఫ్‌బోర్డు పాలకమండలి సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం కొత్తగా నియమితులైన ముతవల్లీలు, మేనేజింగ్‌ కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లపై ఉచిత శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత మిషన్లను పంపిణీ చేస్తామన్నారు. ప్రతి వక్ఫ్‌బోర్డు సంస్థ ఆదాయానికి అనుగుణంగా విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు అబ్దుల్ అజీజ్. సంస్థ ఆదాయాన్ని పెంచి అది పిల్లల చదువుకు ఉపయోగపడేలా వినియోగించాలి అని సూచనలు చేశారు. ఆ సంస్థకు వచ్చే డబ్బును పిల్లల చదువుల కోసం ఉపయోగించాలన్నారు. 'మీ సొంత పిల్లలను' చదివించిన భావనతో వారి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగా ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల సభ్యులకు ఇచ్చేది పదవులు కాదని బాధ్యతని ఇస్తున్నామన్నారు అజీజ్. గతంలో వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి సంక్షేమం జరగలేదన్నారు. గతంలో ఎంతో మంది దాతలు వేల ఎకరాలు దానం చేసి వెళ్లారని.. దాదాపు 70 వేల ఎకరాల భూమిలో 30 వేల ఎకరాలు ఆక్రమణకు గురై వక్ఫ్ బోర్డు చేతుల్లో లేకుండా పోయింది. మిగిలిన భూముల్లో దాదాపు 15 వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. దేవుడి ఆస్తులను చౌకగా కోరుకోకూడదని, ప్రీమియంగా తీసుకోవాలి అన్నారు. ఒక విద్యార్థిని సమాజం ఉన్నత చదువు చదివించాలని సమాజానికి తిరిగి మేలు చేస్తాడన్నారు. అందరూ తనతో కలిసి నడిస్తే ముస్లిం సమాజాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతామన్నారు అబ్దుల్ నజీర్.దర్గాను సందర్శించిన అజీజ్ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పెద్ద కాకానిలో హజరత్ సయ్యద్ బాజిషాహీద్ బాబా అవులియా దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దర్గాకు వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి తలెత్తే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేవని అధికారాలను మందలించారు. దర్గా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చేవారం మళ్లీ పర్యటనకు వస్తానని ఈలోపు దర్గా పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలి అన్నారు. స్థానికులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దర్గా వద్ద భక్తుల దగ్గర నుంచి మరుగుదొడ్లు వినియోగం కోసం వసూలు చేస్తున్న రుసుము రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదొక ఘన చరిత్ర కలిగిన దర్గా అని, దర్గా చరిత్రకు ఇక్కడి పరిస్థితుల కు సంబంధమే లేదన్నారు అజీజ్. దర్గాలో ప్రతి అంగుళం మారుస్తామని ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రూ.2 కోట్లతో దర్గా అభివృద్ధి చేయబోతున్నామని.. దుర్గా పవిత్ర తన కాపాడుతూ దర్గాను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆరో ప్లాంట్ ను నిర్మిస్తామని.. చిన్నపిల్లల కొరకు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు.