Today: భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇన్నాళ్లు పసిడి ధరలను చూసి వెనకడుగు వేసిన వారంతా ఇప్పుడు జువెలరీ షాపులకు వచ్చి తమకు కావాల్సిన నగలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, థాయ్, కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చాలా కారణాలు బంగారం ధరలు తగ్గేందుకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో జూలై 29వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో భారీ పతనంఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 18 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ రేటు ఇవాళ 3319 డాలర్ల వద్దకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.08 శాతం తగ్గింది. ఔన్స్ సిల్వర్ ధర 38.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ స్థిరంగానే ఉన్నాయి. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 99 వేల 930 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా రూ.91 వేల 600 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి సైతం శాంతించింది. రెండ్రోజుల క్రితం రూ.2000 మేర తగ్గిన వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,26,000 వద్ద ట్రేడవుతోంది. అయితే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,16,000లకే లభిస్తుండడం గమనార్హం. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు జూలై 29వ తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి పసిడి ధరలు మారుతుంటాయి. జీఎస్టీ సహా ఇతర పన్నులు కలిపి లెక్కగడితే పసిడి ధరలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందుకే మీరు కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే బంగారం ధరలు తెలుసుకోవడం మంచిది.