హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు... ఉత్తరభాగం పనులపై కీలక అప్డేట్

Wait 5 sec.

తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరంతో రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి గజ్వేల్, భువనగిరి చౌటుప్పల్ వరకు నిర్మిస్తున్నారు. ఈ భాగం సుమారు 158 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. (సంగారెడ్డి జిల్లా) వరకు ఓఆర్ఆర్‌కు సమాంతరంగా నిర్మించబడుతుంది. ఈ భాగం సుమారు 182 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మెుత్తంగా దాదాపు 340 కి.మీ పొడవుతో రింగు రోడ్డును నిర్మిస్తున్నారు. తాజాగా.. వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం 4 వరుసల నుంచి 6 వరుసల విస్తరణ పనులకు జాప్యం తప్పేలా లేదు. ప్రస్తుతం 4 వరుసల రహదారి పనులకు సంబంధించి టెండర్ల గడువును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సెప్టెంబర్ 3, 2025 వరకు పొడిగించింది. గత ఏడాది డిసెంబర్ 27న ఆర్‌ఆర్‌ఆర్‌ పనులకు తొలిసారి టెండర్లు పిలిచినా.. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరిలో బిడ్‌లను తెరవలేకపోయారు. ముఖ్యంగా, కేంద్ర మంత్రివర్గం ఆమోదం లేకుండానే గతంలో ఎన్‌హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించడం ఒక సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని 4 వరుసల నుండి 6 వరుసల రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేయడంతో ఎన్‌హెచ్ఏఐ మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించి 6 వరుసల రహదారి నిర్మాణానికి అంగీకరించింది. అయితే, 6 వరుసల రహదారి పనులకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించాలి. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతే కొత్త టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉంది, ఇది పనులకు మరింత సమయం పట్టేలా చేస్తుంది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. నగర అభివృద్ధికి మరింత ఊపు లభిస్తుంది. అయితే, ప్రస్తుత టెండర్ల జాప్యం ఉత్తర భాగం పనుల ప్రారంభాన్ని ఆలస్యం చేయనుంది.