బిగ్‌బాస్ సీజన్-7లో శోభాశెట్టిని చూసి ఆడియన్స్ ఎంత తిట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు శోభా ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అంటూ ప్రతివారం ఆడియన్స్ చర్చించుకుంటూనే ఉండేవారు. కానీ బిగ్‌బాస్, హోస్ట్ నాగార్జున ఇద్దరూ శోభాని కాపాడుతూనే వచ్చారు. అయితే ఫినాలేకి ముందే శోభా వెళ్లిపోయిందనుకోండి అది వేరే విషయం. అయితే తెలుగు బిగ్‌బాస్‌తో పాటు కన్నడ బిగ్‌బాస్‌లో కూడా శోభా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది శోభాశెట్టి. అయితే రెండు వారాలు గడగడలాడించిన శోభా ఆ తర్వాత మాత్రం తన వల్ల కాదంటూ ఏడుపు మొదలుపెట్టింది. హోస్ట్ కిచ్చా సుదీప్‌తో తనని పంపించేయాలంటూ వేడుకున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఆ సమయంలో శోభాశెట్టిపై సుదీప్ గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇది చూసి తెలుగు ఆడియన్స్ కూడా శోభాని ట్రోల్ చేశారు. అయితే ఇన్నాళ్లకి ఆ వీడియోపై.. అసలు ఆరోజు ఏం జరిగిందనే దానిపై శోభాశెట్టి క్లారిటీ ఇచ్చింది. తాజాగా .. కన్నడ బిగ్‌బాస్ గురించి ఏం చెప్పిందో చూద్దాం.కిచ్చా సుదీప్ ఏమన్నారంటే?"నువ్వు ఒకరి గురించి మాట్లాడితే ఓకే కానీ ఆ హీరోని కూడా బ్లేమ్ చేయడం ఎందుకు? నన్ను తిట్టారని అందరూ ట్రోల్ చేశారు.. ఎవరూ ఎవరినీ తిట్టరు.. అసలు ఏమైందంటే కన్నడ బిగ్‌బాస్‌కి వెళ్లగానే 2 వారాలకి నాకు హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి.. అప్పుడు నేనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వచ్చేశానన్నమాట.. అయినా అంత పెద్ద షోలోకి నువ్వు వెళ్తున్నావంటే చాలా రూల్స్, అగ్రిమెంట్స్ ఉంటాయి.. అది అంత ఈజీ కాదు.. ఇలా వెళ్లడం అలా వచ్చేయడం అనేది మన చేతుల్లో ఉండదు.. అప్పుడు సుదీప్ గారు ఎందుకంత కోపపడ్డారంటే చాలా రోజుల తర్వాత కన్నడకి కమ్‌బ్యాక్ అయ్యాను.. లక్కీగా ఆ రోజు నాకే హయ్యెస్ట్ ఓట్లు వచ్చాయి.. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాను.. మరి జనాలు మీకు ఇంత సపోర్ట్ చేస్తే మీరు వాళ్లని లెక్కచేయకుండా హెల్త్ ఇష్యూ అని చెప్పి వెళ్లిపోతున్నారని సుదీప్ ఫైర్ అయ్యారు.. అయితే వాళ్లు చెప్పేది వాళ్లు చెప్తారు.. కానీ ఉండాల్సింది నేను.. లోపల ఉంటున్నందుకు ప్రతి వారం ఇంత అని నాకు డబ్బులు కూడా ఇస్తారు.. అలానే ఫేమ్ కూడా వస్తుంది.. ఇదంతా తెలిసి కూడా ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా.. నా వల్ల కాదు ఇక నేను చేయలేనని డిసైడ్ అయినప్పుడే నేను బయటికి వచ్చాను.. బయటికి వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పాల్సింది నా ఫ్యామిలీకి మాత్రమే.. వాళ్లందరూ ఒక్కటే చెప్తారు ఎప్పుడూ.. ఎక్కడికైనా వెళ్లు, ఏదైనా చెయ్ నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే అంటారు. అయితే నేను నాకు ఓట్లు వేసిన ఆడియన్స్‌ని ఎప్పుడూ గౌరవిస్తాను.. అదే లోపల చెప్పాను.. బయటకి వచ్చాక కూడా చెప్పాను. ఆరోజు బిగ్‌బాస్ టీమ్ వాళ్లు లోపలికి వచ్చి నాతో మాట్లాడారు.. వాళ్లు వంద చెప్తారు అబ్బా.. రేపు సెట్ అవుతుంది, ఎల్లుండు సెట్ అవుతుంది హెల్త్ అని.. కానీ నేను ఉండాలి కదా.. హెల్త్ సపోర్ట్ చేయలేదు నాకు.. నామినేషన్స్ రోజు ఎనర్జీ కావాలి కదా.. నాకు అప్పుడు అంత బాలేదు.. అందుకే ఎవరు ఎంత చెప్పినా నో చెప్పాను.. ఇక సుదీప్ గారు అలా మాట్లాడటంలో తప్పేం లేదు.. హోస్టుగా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు.. అయితే చెప్పే విధానం చూసేవాళ్లకి అలా అనిపించి ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు." అంటూ శోభాశెట్టి చెప్పింది.