తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు, స్పీకర్‌కు డెడ్‌లైన్

Wait 5 sec.

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదని జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.