IT Notice: ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మీ ఆదాయం మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, కనీస మినహాయింపు పరిమితి అనేది మీరు ఎంచుకునే పన్ను విధానం (Tax Regime)పై ఆధారపడి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది.సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు. అయితే, ఆదాయపు పన్ను చట్టం, 1961లో పేర్కొన్న కొన్ని నిబంధనల ప్రకారం.. మీ స్థూల పన్ను విధించదగిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ మీరు మీ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిమితికి లోపలే ఉన్నా మీ ఖర్చులు సైతం లెక్కలోకి వస్తాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 139(1) నిబంధనల కింద ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అలాంటి కొన్ని పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఖర్చులు రూ.2 లక్షలు దాటితే..భారతీయ పౌరులు ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో లేదంటే మీకు ఐటీ శాఖ నోటీసు పంపిస్తుంది. అంత ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చూపాలని అడుగుతుంది. కరెంట్ బిల్ లిమిట్ దాటితే..ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఒక వ్యక్తి తమ ఎలక్ట్రిసిటీ బిల్లు రూ.1 లక్ష ఆపైన చెల్లించినట్లయితే తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ కరెంటు బిల్లును సింగిల్ పేమెంట్ చేసినా లేదా ఏడాది పొడవునూ విడతల వారిగా చెల్లించినా మొత్తం రూ.1 లక్ష దాటితే ఐటీఆర్ దాఖలు చేయాలి. లేదంటే నోటీసులు అందుతాయి. పొదుపు ఖాతా డిపాజిట్ లిమిట్దేశంలో దాదాపు అందరి వద్ద బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. అందులో డిపాజిట్ చేసే నగదు సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. ట్యాక్స్ నిబంధనల పరిమితి మించి డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారైనా ఎవరైనా తమ సేవింగ్స్ అకౌంట్లో రూ.50 లక్షలకు మించి డిపాజిట్ చేసినప్పుడు లేదా కరెంట్ అకౌంట్ కలిగి ఉండి ఒక ఏడాదిలో రూ.1 కోటి ఆపైన డిపాజిట్ చేసినప్పుడు ఐటీ రిటర్నులు కచ్చితంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.