Helmet, Seat Belt,Fines or Traffic Police Fear - This Incident in Mumbai Is an Example of SafetyWhile Travelling(adsbygoogle = window.adsbygoogle || []).push({});హెల్మెట్, సీట్బెల్ట్ మన కోసమా, ఫైన్ పడిద్దనా లేదా ట్రాఫిక్ పోలీస్ ల మీద భయం తోనా – ప్రయాణం లోబద్రత గురించి ముంబై లో జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణ ===================ట్రాఫిక్నిబంధనలకు సంబంధించి పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో దంపతులువెళ్తున్న కారును ఆపిన విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందులోనిమహిళకు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించాడు. ఆ మేరకు మహిళ అలాగే చేసింది. కొద్దిదూరం వెళ్లిన ఆ కారు అదుపుతప్పి తీవ్ర ప్రమాదానికి గురయ్యింది. భర్తకు స్వల్పగాయాలవగా.. ఆమె మాత్రం చిన్న గాయం లేకుండా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఇటీవలముంబయిలో చోటుచేసుకుంది.గౌతమ్ రోహ్రా, ఆయన సతీమణితో కలిసి శనివారం (జులై 26) సాయంత్రం ఇంటికిబయలుదేరారు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. రోహ్రా సీటు బెల్టుపెట్టుకున్నప్పటికీ పక్క సీట్లో ఉన్న ఆయన భార్య మాత్రం ధరించలేదు. బాంద్రా ఈస్ట్ లోని కాలానగర్ వద్దకు రాగానే అక్కడ విధులునిర్వర్తిస్తున్న ప్రవీణ్ క్షీరసాగర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ విషయాన్నిగమనించాడు. కారు ఆపి సీటు బెల్టు ధరించాలని, లేదంటే రూ.1000 జరిమానా పడుతుందన్నాడు. వీటికంటే ముఖ్యంగా ప్రమాదాలుజరిగినప్పుడు ప్రాణాలు కాపాడతాయని సూచించాడు. ఆయన సూచన మేరకు ఆమె సీటు బెల్టుధరించడంతో జరిమానా విధించకుండానే కానిస్టేబుల్ వారిని పంపించాడు.అలా ముందుకుసాగిన ఆ దంపతులు కారు.. అంధేరీ ఫ్లైఓవర్ పై భారీ ప్రమాదానికి గురైంది. డివైడర్ ను ఢీకొనిరెండు పల్టీలు కొట్టింది. వెంటనే అక్కడున్న ఓ పోలీస్ తోపాటు కానిస్టేబుల్ వారినిబయటకు తీశారు. భర్తకు స్వల్ప గాయాలు కాగా.. ఆయన సతీమణికి చిన్న గీత కూడా పడకుండాబయట పడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవాలని 15 నిమిషాల క్రితం కానిస్టేబుల్ చేసిన సూచన తమ ప్రాణాలను రక్షించిందనిగ్రహించారు. అతడిని కలిసి కృతజ్ఞత కూడా తెలియజేశారు. సీటు బెల్టు ప్రాముఖ్యతనువివరిస్తూ ముంబయి పోలీసులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.===================We Don't Just Fine, We Also Ensure You Remain Fine!All it took was a seatbelt and PC Pravin Kshirsagar’s small advice to save a life from a horrific accident.#OneFineDay#ClickItStayFine pic.twitter.com/IjCSps56lk— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 28, 2025 (adsbygoogle = window.adsbygoogle || []).push({});