అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ. 17 వేల కోట్ల విలువైన లోన్ ఫ్రాడ్ కేసులో సమన్లు!

Wait 5 sec.

: ఒకప్పుడు దేశంలోనే దిగ్గజ వ్యాపారవేత్తగా, అపర కుబేరుడిగా వెలుగొందిన అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి. . ఇటీవల రూ. 17 వేల కోట్ల విలువైన లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి.. అనిల్ అంబానీకి చెందిన పదులకొద్దీ కంపెనీలపై దాడులు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద.. ముంబైలో అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ వంటివి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏకంగా 35 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి తాజాగా చర్యలు చేపట్టింది. దీంతో అప్పటి నుంచి అవుతున్నాయి. ముందుగా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు.. రూ. వేల కోట్ల మేర బ్యాంక్ లోన్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపైనే కేసు నమోదైంది. ఇంకా గతంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 3 వేల కోట్ల రుణాలు.. ఇతర షెల్ కంపెనీలకు అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంకా లోన్ కోసం బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం కూడా ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీనే అయిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ. 10 వేల కోట్ల లోన్‌ కూడా ఇలాగే దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటు అనిల్ అంబానీకి చెందిన మరికొన్ని కంపెనీలు కూడా ఇలాగే మోసం చేశాయని.. మొత్తం రూ. 17 వేల కోట్ల మేర రుణ మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.ఈడీ సోదాలకు కొద్ది రోజుల ముందు.. అనిల్ అంబానీకి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేసింది. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగానే.. ఎస్బీఐ ఫ్రాడ్ కింద వర్గీకరించినట్లు పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతే కాదు.. దీనిపై ఎస్బీఐ.. సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ క్రమంలోనే కొద్ది రోజులకే ఈడీ అనిల్ అంబానీపై దాడులు చేయడం.. ఇప్పుడు విచారణకు రావాలని నోటీసులు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.