EPS-95 pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుందన్న వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షనర్ల సుదీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ అయితే, తాజాగా ఈ అంశంలో కీలక అప్డేట్ వచ్చింది. పార్లమెంటులో పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి ఈ పండగల సీజన్ చివరి నాటికి కనీస పెన్షన్ పెంచుతున్నారా? పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది? అనే వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) పరిధిలోని పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన అమౌంట్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ రూ.1000గా ఉంది. అయితే, కార్మిక సంఘాలు, పెన్షనర్లు, అసోసియేషన్లు, ప్రజా ప్రతినిధిలు ఈ కనీస పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా ధ్రువీకరించింది. కనీస పెన్షన్ పెంచాలంటూ ట్రేడ్ యూనియ్లు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా వినతులు వచ్చినట్లు తెలిపింది. అదే నిజమైతే ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? కార్పస్ ఫండ్‌లో తగినంత నిధులు అందుబాటులో ఉన్నప్పుడు, పేరుకుపోయిన క్లెయిమ్ చేయని నిధులు ఉన్నప్పుడు ఈపీఎఫ్ పెన్షన్‌ను పెంచడంలో ఉన్న అడ్డంకి ఏమిటి? రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం వేగవంతం చేస్తుందా? అని అడిగారు. ఈ విషయాలపై కేంద్రం స్పందించింది. ఈపీఎస్ 95 కింద ప్రస్తుతం అందిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ పెంచాలని ట్రేడ్ యూనియన్లు, ప్రజా ప్రతినిధిలు సహా వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి చాలా వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఈపీఎస్ 95 అనేది కంట్రిబ్యూషన్ ప్రకారం బెనిఫిట్ అందించే ఒక సామాజిక భద్రతా పథకం మని తెలిపారు. ఉద్యోగం కల్పించిన సంస్థ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుందన్నారు. వాటి ప్రకారమే అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ రూ.1000 అదిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. పండుగ సీజన్‌కు ముందు పెన్షన్ పెంపు ఉంటుందనే విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ప్రభుత్వం ఒక కాలక్రమానికి కట్టుబడి లేదు కానీ కనీసం రూ. 1,000 పెన్షన్‌ను నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతును అందిస్తూనే ఉందని పునరుద్ఘాటించింది.