వామ్మో.. ఏడాదికి రూ.1250 కోట్లా? వందల కోట్ల జీతాలు అందుకుంటోన్న భారతీయులు వీళ్లే

Wait 5 sec.

Multi Million Dollars Salary: వంద కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో లెక్కబెట్టేందుకే మనకు కాస్త సమయం పడుతుంది. అలాంటిది వందల కోట్లు జీతాలంటే నోరెళ్లబెట్టాల్సిందే. భారతీయుల్లో చాలా మంది రూ. 20 వేలు, రూ. 30 వేలలోపు జీతాలతోనే పని చేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే కోట్లలో అందుకుంటున్నారు. అయితే ఏడాదికి వందల కోట్లు జీతం అందుకునే భారతీయులు సైతం ఉన్నారని మీకు తెలుసా? ఏడాదికి రూ. 1250 కోట్లు, రూ. 1200 కోట్లు, రూ. 800 కోట్లు అంటూ జీతాలు అందుకునే మల్టీ మిలియన్ డాలర్ జీతాలు అందుకునే భారతీయుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ వచ్చాక టెక్నాలజీ నిపుణుల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సూపరింటెలిజెన్స్ టీమ్ కోసం నియామకాలు చేపట్టారు. ఆ టీమ్‌లో వినిపిస్తున్న పేరు భారతీయ యువకడు త్రపిత్ బన్సల్. 35 ఏళ్ల త్రపిత్ ఐఐటీ కాన్పూర్‌లో పట్టా అందుకున్నాడు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పీహెచ్‌డీ చేశాడు. ఓపెన్ ఏఐ సంస్థలో రిసెర్చ్ సైంటిస్ట్‌గా పని అనుభవం ఉంది. ఓ సిరీస్ వంటి ప్రాజెక్టులకు పని చేశాడు. ఈ అర్హతలతోనే మెటా డ్రీమ్ టీమ్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. దిగ్గజ కంపెనీల్లో సీఈఓ, సీఎఫ్ఓ, సీఓఓ అనే సీ-సూట్ స్థాయులు, వైస్ ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్ వంటి వీ, డీ సూట్ స్థాయుల్లోనూ భారతీయులు రాణిస్తున్నారు. వీరి జీతాలూ భారీగానే ఉన్నాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్ సంస్థ సీఈఓ నికేష్ అరోరాకు ప్రస్తుతం రూ.1250 కోట్లు శాలరీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబీ కుటుంబంలో జన్మించిన నికేష్ బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. అమెరికాలోని బోస్టన్ కాలేజీ నుంచి ఎంఎస్ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. గూగుల్‌లో కొంత కాలం పని చేసి ఆ తర్వాత పాలో ఆల్టో నెట్‌వర్క్ సంస్థను లీడ్ చేస్తున్నారు. లాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కార్ల సంస్థ సీఎఫ్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జీతం రూ.1200 కోట్లుగా ఉంటుందని సమాచారం. ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేసిన వైభవ్ ఆపై సీఏ చేశారు. అమెరికా వెళ్లి టెస్లాలో అత్యదిక జీతం అందుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీ బోర్డు రూమ్ సభ్యుల్లో ఒకడిగానూ ఉన్నారు. ఎలాన్ మస్క్ పెడుతున్న అమెరికన్ పార్టీలో ట్రెజరర్‌గానూ అవకాశం అందుకోనున్నాడని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియాలో వరల్డ్ వైడ్ గ్లోబల్ ఆపరరేషన్స్ వైస్ ప్రెసిండెంట్‌గా ఉన్న అజయ్ పురి రూ.185 కోట్ల జీతం తీసుకుంటున్నారట. అలాగే హాట్ స్పాట్ అనే సాఫ్ట్ వేర్ సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యామినీరంగన్ రూ.200 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వందల కోట్లు జీతం అందుకుంటున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతూ ఈ మేర రాణిస్తున్నారు.