తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు దక్కనుంది. ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారికి ఈ పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి స్థలం లేని వారికి శుభవార్త చెప్పింది. ఈ లబ్ధిదారులను ఎల్2 కేటగిరీ కింద చేర్చి.. రెండో జాబితాలో వారికి ఇళ్లను కేటాయిస్తామని పేర్కొంది. సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక కీలక ఆదేశం జారీ చేశారు. ఆగస్టు 15 లోగా వారికి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా.. ఇంటి స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఈ అసంపూర్తి డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆగస్టు 15 లోగా కేటాయించాలని మంత్రి సూచించారు. ఈ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వమే రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఇది లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి గొప్ప ఊరటనిస్తుంది. ముఖ్యంగా, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారన్నది ప్రధానం కాదని.. తాజా దరఖాస్తులను పరిశీలించి కేటాయింపులు చేయాలని మంత్రి కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పాత దరఖాస్తుదారులతో పాటు.. కొత్తగా అర్హత సాధించిన వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తీరుకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది.ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సొంత ఇల్లు కలిగి ఉండటం అనేది ఒక ప్రాథమిక అవసరం కాబట్టి.. ఈ పథకం ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తైన తర్వాత.. లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇదిలా ఉండగా.. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించిన తర్వాత.. వాటిని రెంట్ కి ఇచ్చే అయింది.