ఆర్‌బీఐ చెప్పినా ఆ బ్యాంకులు వినట్లే.. కస్టమర్లపై EMIల భారం.. చర్యలకు వినతి!

Wait 5 sec.

Bank Interest Rates: ఈ ఏడాది వరుసగా మూడు ద్వైమాసిక సమావేశాల్లో వడ్డీ రేట్లను (RBI) తగ్గించిన సంగతి తెలిసిందే. 25 బేసిస్ పాయింట్లు, 25 బేసిస్ పాయింట్లు,ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బ్యాంకులు వివిధ రుణాల వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించాయి. అయితే, ప్రైవేట్ రంగంలోని చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలో ఆలస్యం చేస్తున్నాయట. రెపో రేటు తగ్గించిన ప్రయోజనాన్ని వెహికల్ లోన్స్ తీసుకున్న కస్టమర్లకు బదిలీ చేయడంలో ప్రైవేట్ రంగంలోని చాలా బ్యాంకులు ఆలస్యం చేస్తున్నట్లు వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (FADA) ఆరోపించింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవాలని కోరింది. హికల్ లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేట్లను వెంటనే తగ్గించేలా ప్రైవేట్ బ్యాంకులుక ఆదేశాలు ఇవ్వాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది. ' మీ నాయకత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా రెపో రేటును తగ్గించి, ఆర్థిక వ్యస్థకు సానుకూల సంకేతాలు అందించింది. అయినప్పటికీ వాహన రిటైల్ రంగానికి ఈ ప్రయోజనం పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని తక్షణమే తమ ఖాతాదారులకు చేసినప్పటికీ ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు ఆలస్యం చేస్తున్నాయి' అని లేఖలో పేర్కొన్నారు ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న వారిపై అదనపు భారం పడుతోందని, ఇప్పటికీ ఈఎంఐలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 2025లోనే వడ్డీ రేట్లు సవరించడం మూడోసారి. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 పాయింట్లు కోత పెట్టగా.. జూన్ నెలలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు చాలా రోజుల తర్వాత 6 శాతం కిందకు దిగివచ్చింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అయితే, డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గడం డిపాజిటర్లకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. దీంతో చాలా మంది ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి చూస్తున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి ఇది సరైన సమయం కాదనే చెప్పాలి.