భారత్, తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు 23 రోజుల ఆట జరగ్గా.. మరొక రోజులో సిరీస్ ఫలితం తేలిపోనుంది. ఐదో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్, ఇంగ్లాండ్‌లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు.. 75/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు ఆలౌట్ అయింది. అదరగొట్టాడు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ సైతం హాఫ్ సెంచరీ (66) చేశాడు. ర, వాషింగ్టన్ సుందర్ (53) సైతం రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు, గస్ అట్కిన్సన్ 3, జెమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్‌తో కలిపి టీమిండియా ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మూడో రోజు ఎట్టిపరిస్థితుల్లో వికెట్ ఇవ్వకూడదనే పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. దీంతో ఆట ముగిసేందుకు సమయం కావస్తుండటంతో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే రోజును ముగించేలా కనిపించింది. తొలి వికెట్‌కు ఆ జట్టు బ్యాటర్లు 13 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. అయితే ఈ సమయంలోనే మహమ్మద్ సిరాజ్.. అద్భుత డెలివరీతో జాక్ క్రాలీని బోల్తా కొట్టించాడు.కళ్లు చెదిరే యార్కర్ వేసిన సిరాజ్.. క్రాలీ (14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 50 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ పడిన వెంటనే అంపైర్లు మూడో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 పరుగులు కావాలి. అటు భారత్ సిరీస్‌ను లెవెల్ చేయాలంటే.. మరో 8 (క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేయలేడు) వికెట్లు తీయాలి. మొత్తంగా ఈ టెస్టు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసే అవకాశం కనిపిస్తోంది.