కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారులు నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి రెండు తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పారు. విజయవాడ- హైదరాబాద్ మధ్య .. నిర్మిస్తామని వెల్లడించారు. అలానే ప్రస్తుతం ఈ రెండు పట్టణాల మధ్య అనగా హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఇప్పుడున్న రోడ్డును ఆరు లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయి అని తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం సగానికి సగం.. అనగా ఐదు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందన్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఇప్పటికే ఏపీలో జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియక ముదే.. మరో లక్ష కోట్ల రూపాయల కొత్త పనులు ఆరంభిచబోతున్నాం అన్నారు. ఇవి పూర్తయితే.. రానున్న రెండేళ్లలో రోడ్లు.. అమెరికాకు సమానంగా ఉండబోతున్నాయి అని నితిన్ గడ్కరీ తెలిపారు.మంగళగిరిలో శనివారం నిర్వహించిన , ప్రారంభ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగానే రాష్ట్ర అభివ‌ృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నాయకత్వం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగేస్తోందని తెలిపారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు దార్శనికత, ఆలోచనను అభినందిస్తున్నారు. విజన్ అంటే ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు.నీరు, కమ్యూనికేషన్, విద్యుత్తు, రవాణా వంటి రంగాల్లో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే.. మరికొన్ని సంవత్సరాల్లో.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1, రెండో స్థానాల్లో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదన్నారు నితిన్ గడ్కరీ. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో మన దేశ రైతులు అన్నదాతలే కాదు ఇంధన దాతలు కూడా అయ్యారని చెప్పుకొచ్చారు. అలానే రానున్న రోజుల్లో రైతు బిటుమిన్‌ దాత కూడా కాబోతున్నారని తెలిపారు. ఇప్పటికే వరిగడ్డితో తయారు చేసే బిటుమిన్ ద్వారా నాగపూర్-జబల్పుర్‌ నేషనల్ హైవేలో కిలోమీటరు రహదారిని నిర్మించామని చెప్పుకొచ్చారు.