జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపై పెను ఆర్థిక భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు చేదోడుగా నిలిచే తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడమే కాకుండా.. కూలీలకు అందే ఉపాధిపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాసన మండలిలో ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం ఉండేది. అయితే.. కొత్త చట్టం ప్రకారం నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చారు. అంటే కేంద్రం 60 శాతం నిధులు ఇస్తే.. రాష్ట్రం తప్పనిసరిగా 40 శాతం భరించాలి. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా రూ. 1,789 కోట్ల భారం పడనుంది. పాత పద్ధతిలో రాష్ట్రం వాటా కేవలం రూ. 532.13 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా రూ. 2,320.10 కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం అని మంత్రి స్పష్టం చేశారు.ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలే ఉన్నారు. అందులోనూ 62 శాతం మంది మహిళలు ఈ పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్రం పనిదినాలను 125 రోజులకు పెంచామని చెబుతున్నప్పటికీ.. అందులో 75 రోజులకు మాత్రమే నిధులు ఇస్తామని.. మిగిలిన 50 రోజులు రాష్ట్రాలే భరించాలని చెప్పడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ కూలీలకు 'హాలిడే' పేరుతో పని లేకుండా చేయడం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.గత రెండు దశాబ్దాలుగా (MGNREGA) గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ వస్తోంది. వలసలను నిరోధించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పేరు మార్చి, నిబంధనలు కఠినతరం చేయడం వల్ల పేదలకు భద్రత కరువవుతోంది. అందుకే ఈ కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని.. పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని కోరుతూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానానికి మండలి సభ్యులు మద్దతు తెలిపారు. అభివృద్ధి పేరుతో సామాన్యుల హక్కులను కాలరాయవద్దని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో.. ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి దేశ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం మొదలు కానుంది.