Latest : బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం ఉంటుంది. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది మహిళలకు మరింత అందాన్ని ఇస్తుందని చెబుతుంటారు. ఇంకా భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువ. చైనా తర్వాతి స్థానంలో ఉంటుంది. ఇదే సమయంలో దేశీయంగా బంగారం అవసరాల్ని తీర్చుకునేందుకు ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం బంగారం భౌతికంగా కొనడం తగ్గించారు జనం. రేట్లు ఆ స్థాయిలో పెరిగాయి మరి. గతేడాది రికార్డు స్థాయిలో 70 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఎన్నో కారణాలు ఇందుకు దోహదం చేశాయని చెప్పొచ్చు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా విధించిన సుంకాలు, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వంటివి పెరిగేందుకు దోహదం చేశాయి. వీటికి తోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధర పెరిగేందుకు కారణమైంది. అయితే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు 2026లో కాస్త వాయిదా పడే అవకాశం ఉందన్న అంచనాలతో అదే విధంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతారన్న సంకేతాలతో బంగారం ధర 2025 చివర్లో భారీగా దిగొచ్చింది. వరుసగా 3 రోజుల్లో చూస్తే గోల్డ్ రేటు తులం రూ. 7 వేల వరకు దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ రికార్డు గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గింది. స్పాట్ గోల్డ్ రేటు ఒక దశలో ఔన్సుకు 5,549 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకగా మళలీ 5,300 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. సిల్వర్ రేటు కూడా ఇదే విధంగా 84 డాలర్ల నుంచి 70 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇక వరుసగా తగ్గి.. .. ఇప్పుడు 3వ తేదీ సాయంత్రం నాటికి పడిపోయింది. స్వల్పంగా రేట్లు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్త ఎక్కువే పతనం అయ్యాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5,380 డాలర్ల స్థాయికి చేరుకోగా.. ఇప్పుడు 5,330 డాలర్ల వద్ద ఉంది. దేశీయంగా కూడా ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 350 తగ్గి తులం రూ. 1,24,500 కు చేరింది. ఇదే సమయంలో పలు జువెల్లరీల్లోనూ రేట్లు మారాయి. మలబార్ గోల్డ్‌లో పసిడి ధర గ్రాముకు రూ. 12,450 కి చేరింది. ఇదే సమయంలో తనిష్క్ జువెల్లరీలో బంగారం ధర గ్రాము రూ. 12,490 పలుకుతోంది. లలితా జువెల్లరీ, జోయాలుక్కాస్, ఖజానా, కళ్యాణ్ జువెల్లర్స్ వంటి వాటిల్లో పసిడి ధర గ్రాము రూ 12,450 వద్ద ఉంది. ఇక్కడ రేట్లు ఇలా ఉన్నా.. తుది బిల్లుపై 3 శాతం జీఎస్టీ పడుతుంది. ఇంకా బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. ఇవి షాపుల్ని బట్టి వేర్వేరుగా ఉంటాయని చెప్పొచ్చు.