8వ వేతన సంఘం మరింత ఆలస్యం.. బకాయిల రూపంలో ఉద్యోగులకు ఎంతొస్తుందో తెలుసా?

Wait 5 sec.

: గతేడాది డిసెంబర్ 31తోనే 7వ వేతన సంఘం గడువు ముగిసింది. అయితే కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే వాస్తవానికి అమలు కావాల్సి ఉంది. కానీ ఇది ఇంకా అమల్లోకి రాలేదు. తమ జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు, డీఏ వంటివి పెరుగుతాయని , పెన్షనర్లు ఎంత ఆశగా ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఇది అమల్లకి వచ్చేందుకు ఇంకా చాలా సమయమే పట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు ఎదురుచూసిన వారు.. ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితే నెలకొంది. 2025, డిసెంబర్ 31తోనే 7వ వేతన సంఘం విధివిధానాలు పూర్తి కావడంతో.. వచ్చాయి. అయితే ఇది వార్తల్లో ఊహాగానాల వరకే పరిమితమైంది. దీని గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే.. వేతనాలు, ఇతర అలవెన్సుల పెంపు అనేది ఆటోమేటిక్‌గా ఉండదు. అంటే జనవరి నుంచి కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తమ జీతాలు, పెన్షన్ పెరగలేదు. అయితే ఇందుకోసం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పటికీ.. 2026 రెండో అర్ధభాగం లేదా 2027 ప్రారంభంలో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. అప్పటి నుంచి బెనిఫిట్స్ అందుకోవచ్చన్నమాట. దీనిపైనా క్లారిటీ లేదు. ఒకవేళ 8వ వేతన సంఘం సిఫార్సులు 2027 మే నుంచి అమల్లోకి వచ్చినట్లయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆలస్య కాలానికి గానూ అరియర్స్ (బకాయిలు) అందుకుంటారు. ఇక్కడ వాస్తవ అమలు తేదీ 2026, జనవరి 1 నుంచే వర్తిస్తుంది. మేలో అమల్లోకి వస్తే.. 2027 ఏప్రిల్ వరకు బకాయిల్ని చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం అయితే ఆ కాలానికి కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇది ఒకేసారి బకాయిల్ని కేంద్రం చెల్లిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ బకాయిల్ని చెల్లించేందుకు కేంద్రం.. ఈ నిధుల్ని బడ్జెట్‌లో కేటాయిస్తుందని ఆర్థిక నిపుణులు మదన్ సబ్నవీస్ చెప్పారు. మొత్తం సవరించిన వేతన స్ట్రక్చర్‌కు అనుగుణంగా అరియర్స్ చెల్లిస్తుందని వివరించారు. ఇది కేవలం బేసిక్ వేతనంపైనే ఆధారపడి ఉండదని చెప్పుకొచ్చారు. దీనిని ఉదాహరణల్లో చూస్తే.. ఉద్యోగి నెలవారీ జీతం 8వ వేతన సంఘం అమలుతో రూ. 45 వేల నుంచి రూ. 50 వేలకు పెరిగిందనుకోండి. ఇక్కడ తేడా ఉండే రూ. 5 వేలు అనేది అరియర్స్ రూపంలో మొత్తం కాలానికి వర్తిస్తుంది. ఇక్కడ కొత్త వేతన సంఘం అమలు తేదీ 15 నెలలు ఆలస్యమైతే.. 15 నెలలకు సరిపడా బకాయిలు వస్తాయి. నెలకు రూ. 5 వేల చొప్పున ఇది రూ. 75 వేలుగా ఉంటుంది.