: అదిరిపోయే ప్రకటన చేసింది. గతంలో వివిధ కారణాలతో నిర్దిష్ట గడువులోగా ప్రీమియం కట్టనందుకు నిలిచిపోయిన (ల్యాప్స్ అయిన) వ్యక్తిగత జీవిత బీమా పాలసీలను పునరుద్ధరించుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం 2 నెలల పాటు స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్‌ను లాంఛ్ చేసింది. ఈ స్పెషల్ 2026 జనవరి 1 నే ప్రారంభమైంది. ఇది 2026, మార్చి 2 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అర్హత కలిగినటువంటి అన్ని నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు సంబంధించి.. ఆలస్య రుసుములపైనా అద్భుత స్థాయిలో ఆకర్షణీయ రాయితీల్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇక్కడ రాయితీలు ఎలా ఉన్నాయో చూద్దాం. .. లేట్ ఫీజులో 30 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడ గరిష్ఠ పరిమితి ఉందని వెల్లడించింది. అంటే ఆలస్య రుసుములో గరిష్ఠంగా రూ. 5 వేల వరకు మాత్రమే రాయితీ పొందొచ్చని స్పష్టం చేసింది. ఇక్కడ పాలసీదారులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దానిని బట్టే రాయితీలో ఆఫర్ ఉంటుంది. ఇంకా అల్పాదాయ వర్గాల వారి కోసం తీసుకొచ్చిన మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు 100 శాతం జరిమానా మినహాయింపు ఇవ్వడం విశేషం. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. మొదటిసారి ప్రీమియం చెల్లించిన తేదీ నుంచి ఐదేళ్ల లోపు ఉన్నటువంటి పాలసీల్ని నిబంధనల మేరకు మళ్లీ పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రీమియం చెల్లింపు కాల పరిమితిలో ఉన్నటువంటి పాలసీకే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. పాలసీ రూల్స్‌ను బట్టి.. అవసరమైతే హెల్త్ రిపోర్ట్స్ కూడా సమర్పించాల్సి రావొచ్చు. ఇక్కడ వైద్య పరీక్షలకు సంబంధించి రాయితీ ఉండదు. ఇక్కడ మళ్లీ కొత్త పాలసీ తీసుకోవడం కంటే .. పాత పాలసీ పునరుద్ధరించుకుంటే తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ ప్రయోజనాలు అందుకునేందుకు వీలుంటుందని చెప్పొచ్చు. కాబట్టి.. మీ పాలసీ మధ్యలో ఆగిపోయి ఉంటే దగ్గర్లోని ఎల్ఐసీ కార్యాలయం లేదా ఎల్ఐసీని సంప్రదించడం ద్వారా పూర్తి వివరాల్ని తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ పాలసీ నిలిచిపోయేందుకు చాలానే కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రీమియం చెల్లించాల్సిన గడువు ముగిసిన తర్వాతా.. కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు కూడా కట్టకుంటే పాలసీ రద్దవుతుంది. ఇంకా కొందరు అనుకోని ఖర్చుల వల్ల సమయానికి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల కూడా పాలసీ నిలిచిపోతుంది. కొందరు కట్టాల్సిన తేదీ గుర్తుంచుకోకపోవడం కూడా కారణమే. ఇంకా బ్యాంక్ ఇష్యూస్ ఇక్కడ.. ఆటోడెబిట్ కాకపోవడం, అకౌంట్లో ఆటో డెబిట్ సమయానికి తగినంత నగదు లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉంటాయి.