‘భీమవరం బీట్‌’ సాంగ్‌.. సింగర్ స్మితతో కలిసి స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు

Wait 5 sec.

తెలుగు పాప్ మ్యూజిక్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన . 90వ దశకంలో 'హైరబ్బా', 'మసక మసక చీకట్లో' వంటి ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన ఆమె, తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ కల్చర్‌ను పరిచయం చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటుగా కొన్ని సినిమా పాటలు కూడా పాడారు. కేవలం గాయనిగానే కాకుండా.. మ్యూజిక్ కంపోజర్ గా, నటిగా, హోస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు రీమిక్స్‌ పాటలతో అలరించిన స్మిత.. ఇప్పుడు నేటి యూత్ ని మెప్పించేలా సరికొత్త ఆల్బమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘భీమవరం బీట్‌’ వీడియో సాంగ్‌ ను రిలీజ్ చేశారు. ‘భీమవరం బీట్‌’ పాటను ర్యాపర్‌ నోయల్‌ తో కలిసి స్మిత రూపొందించారు. దీనికి వీరిద్దరూ మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు, స్వయంగా లిరిక్స్ రాసుకొని పాడారు. ఎంతో కలర్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కి 'నా సామిరంగా' ఫేమ్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశారు. గ్రీష్మ ఉమేష్ కొరియోగ్రఫీ చేశారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అదేరే పెరీరా ఎడిటింగ్ వర్క్ నిర్వహించారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. ‘భీమవరం బీట్‌’ పాటలో ఇంకో స్పెషల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభా డిప్యూటీ స్పీకర్‌ సందడి చేశారు. స్మితతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోను మీరూ చూసేయండి.