అమరావతి రైతులకు శుభవార్త.. రూ.900 కోట్లతో ఆ గ్రామాల్లో

Wait 5 sec.

అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సమీపంలోని గ్రామాల్లో రూ.900 కోట్ల మేర ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటుగా, పరిసర గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మరో ఆరు నెలల్లోగా అమరావతి సమీపంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ల్యాండ్ పూలింగ్ సమయంలో తమ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. తాజాగా శనివారం నాడు మంత్రి నారాయణ రాజధాని గ్రామం అయిన ఐనవోలులో పర్యటించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి నారాయణ, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.రాజధాని గ్రామాల అభివృద్ధికి సంబంధించి, గ్రామస్థుల అభిప్రాయాలను తీసుకున్న మంత్రి, తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల పనులు చేపడుతోందని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ఇతర అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని, గ్రామస్థులు కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటన సందర్భంగా ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో మంత్రి నారాయణ వివరించారు.కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం . భూసేకరణకు ఇవ్వని రైతులకు 921 ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు సుమారు 61 వేలకు పైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్ పూర్తయిందని, 7,628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి 312 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.