ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు, ఆగస్టు వరకు మొత్తం క్లియర్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈవో దినేష్‌ కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్‌ఎస్‌ (EHS) ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు. లో.. ఉద్యోగుల వైద్య బిల్లులు, హెల్త్‌ కార్డులు, నెట్‌వర్కింగ్‌ ఆస్పత్రుల్లో చికిత్సలపై దినేష్ కుమార్ చర్చించారు. ప్రభుత్వం ఉద్యోగుల వైద్య బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించి.. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. సుమారు 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను ఆగస్టు నాటికి పూర్తిగా క్లియర్ చేశామని ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈవో దినేష్ కుమార్ తెలిపారు. ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన మొత్తం సమాచారం, మెడికల్ బిల్లుల తాజా పరిస్థితిని ఇకపై వాట్సప్‌ ద్వారా ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు పంపిస్తామన్నారు. అలాగే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈహెచ్‌ఎస్‌ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఇప్పుడు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉద్యోగులు తమ ఆరోగ్య కార్డులకు సంబంధించిన వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా మార్చుకునే వీలుంటుంది. ఇది ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం మీద బిల్లులు చెల్లించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.టీచర్ల సమాచార అప్డేట్‌కు మార్గదర్శకాలుఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల చట్టం ప్రకారం ఏటా బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టీఎస్‌ఎస్‌)ను అప్డేట్ చేసేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వివరాలను సరిచేసుకోవాలని, ఆ తర్వాత తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటిస్తారు. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు చట్టం తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా, పాఠశాల విద్యాశాఖ టీఎస్‌ఎస్‌ (ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ)ను అప్‌డేట్ చేయాలని సూచించింది. ఈ వ్యవస్థలో ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ముందుగా ఒక తాత్కాలిక సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. ఆ తర్వాత, అన్ని పరిశీలనల అనంతరం తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. ఈ విధంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.