ఉపాధి హామీలో కీలక మార్పులు.. ఇకపై అలా చేస్తే కూలీలకు పరిహారం చెల్లించాలి

Wait 5 sec.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(నరేగా (MGNREGA)) లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VBGRAAM) పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. పథకం అమలుకు సంబంధించిన గ్రామసభలను జనవరి 5న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలోని 646 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు. గత 17 సంవత్సరాలుగా అమలవుతూ వస్తున్న లో కేంద్రం అనేక మార్పులు చేసింది. ఇక మీదట ఈ పథకాన్ని వీబీ జీ రామ్ జీ పేరిట కొనసాగించనుంది.ఈ క్రమంలో పథకం అమలుకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. వీబీ జీ రామ్ జీ పేరుతో అమలు చేయబోయే ఈ పథకంలో ఏయే కార్యక్రమాలు అమలు అవుతాయో వివరించనున్నారు. కార్యదర్శులు, ఎంపీడీవోల అధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, ఉపాధి కార్మికులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, ఈ పథకంలోని ప్రధాన అంశాలను వివరిస్తారు. అయితే ఈ గ్రామసభలు 2025, డిసెంబర్ 26ననే జరగాల్సి ఉండగా, ప్రభుత్వం వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాలంటూ తాజాగా ఆదేశాలిచ్చింది. పలు మార్పులతో ఏప్రిల్ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా పని దినాలు 100 రోజులుండగా, . నిర్వహణ వ్యయాన్ని 6 నుంచి 9 శాతానికి పెంచనున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం అమలు వ్యయంలో కేంద్రం 90 శాతం భరిస్తుండగా, మిగిలిన 10 శాతం రాష్ట్రాలు భరించేవి. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ కాలంలో రైతులకు కూలీల కొరత లేకుండా చూసేందుకు గాను, 2 నెలలపాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వనున్నారు. నాలుగు అంశాలకు సంబంధించిన పనులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది అవి గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన, జీవనోపాధుల కల్పన, అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు చేపడతారు. ఈ పథకం ద్వారా ఉపాధి కోరిన వారికి 14 రోజుల్లో పని కల్పించాలి. లేదంటే, నిరుద్యోగ భృతి కింద చెల్లించే వేతనంలో సగం వారి ఖాతాలకు జమవుతుంది. ఈ మొత్తాన్ని బాధ్యులైన సిబ్బంది నుంచి రికవరీ చేస్తారు. అతి ముఖ్యమైనది లో ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారు.ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కొత్తగా 266 పల్లెల ప్రగతి పనులు చేపట్టనున్నారు. మురుగు కాలువల నిర్మాణం, స్కూళ్లు, అంగన్వాడీలకు సొంత బిల్డింగ్‌లు, సీసీ రోడ్లు, పంచాయతీ ఆఫీసులకు సొంత భవనాలు సమకూరనున్నాయి. బీడు, బంజరు భూముల్లో పండ్ల తోటలు, మొక్కలు పెంపకంతోపాటు, ఇకపై వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు కానున్నాయి.