భోగాపురంలో తొలి విమానం ల్యాండ్‌.. మాజీ సీఎం YS జగన్ ఆసక్తికర పోస్ట్

Wait 5 sec.

ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. విజయనగరం జిల్లా . దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలతో పాటుగా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, మోదీ నాయకత్వంలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారమైందన్నారు. నేడు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సైతం దీనిపై స్పందిస్తూ 'ఎక్స్' వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నిర్మాణం సాకారమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న లో నేడు తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి అని చెప్పుకొచ్చారు. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు జగన్.. హృదయపూర్వక అభినందనలు తెలిపారు.తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాక, విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి పునరావాసం కల్పించడం, భూసేకరణ కోసం నాడు తమ ప్రభుత్వం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తైందన్నారు. ఆ రోజు తాము చేసిన కృషి నేడు ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందని జగన్ గుర్తు చేశారు.అలానే విశాఖ పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు కూడా తమ పాలనలోనే అనగా.. 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం తనకు గుర్తుందంటూ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.