ట్రంప్ సంచలన ప్రకటన.. ‘ఇకపై వెనెజులాను అమెరికా పాలిస్తుంది’

Wait 5 sec.

.. , ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజులాను తామే పాలిస్తామని తెలిపారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.దేశం సురక్షితంగా మారే వరకు, సరైన న్యాయపరమైన అధికారాల బదిలీ జరిగే వరకు వెనెజులాను తామే పాలిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీనికి కొద్ది గంటల ముందే అమెరికా ప్రత్యేక దళాలు వెనెజులాపై ఆకస్మిక దాడి చేసి.. , అతని భార్య సిలియా ఫ్లోరెస్‌లను అదుపులోకి తీసుకున్నాయి.ఈ సందర్భంగా , దేశంలో ఒక సురక్షితమైన, సరైన, వివేకవంతమైన మార్పు జరిగే వరకు అమెరికానే వెనెజులాను నడుపుతుంది అన్నారు. ఇతరులు వచ్చి, గతంలో ఉన్నటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కావడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆ దేశాన్ని తామే పాలిస్తామని ట్రంప్ తెలిపారు. వెనెజులా దేశ చమురు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో అమెరికా కంపెనీలు ముందుంటాయని సూచించారు. ఆ దేశం కోసం ఆదాయాన్ని సంపాదించి, వెనెజులా ప్రజలను ధనవంతులను చేస్తాయని తెలిపారు.వెనెజులాపై అమెరికా చేసిన దాడులను.. గతంలో ఇరాన్‌పై చేసిన దాడులతో పోల్చారు ట్రంప్. వెనెజులాపై అమెరికా సాధించిన విజయాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేదని తెలిపారు. వెనెజులా సైన్యాన్ని నిర్వీర్యం చేశామన్నారు ట్రంప్. లక్ష్యాన్ని కచ్చితంగా చేధించేందుకు గాను దాడుల సమయంలో వెనెజులా రాజధాని కారాకస్‌లో కరెంట్ సరఫరాను నిలిపివేశామని తెలిపారు. మదురోకు మద్దతిచ్చే నేతలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మదురోను అదుపులోకి తీసుకోవడంతో వెనెజులా ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు ట్రంప్.అమెరికా చేతిలో వెనెజులా పాలన బాధ్యతలు అనేది తాత్కాలికమని ట్రంప్ ప్రకటించారు. వెనెజులాకు అధికారం ఎప్పుడు తిరిగి అప్పగించాలో అమెరికానే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఆ దేశంలోఎన్నికలు, అంతర్జాతీయ పర్యవేక్షణ, వెనెజులా ప్రజల నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం వంటి వాటి గురించి ఆయన ప్రస్తావించలేదు. వెనెజులాపై అమెరికా దళాలు రెండవ దశ సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నాయని, కానీ మొదటి దాడి విజయవంతం కావడంతో ఆ అవసరం రాలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంఘటనలు వెనెజులా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అమెరికా జోక్యంపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.