నగరవాసులకు ఎగిరిగంతేసే వార్త.. ఓఆర్ఆర్ చుట్టూ మహా మెట్రో.. ఆ 22 చోట్ల స్టేషన్ల నిర్మాణం..

Wait 5 sec.

హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పడబోతోంది. నగరం నలువైపులా ప్రయాణికులకు ‘మహా మెట్రో’ పేరుతో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 360 డిగ్రీల కోణంలో మెట్రో రింగ్ రైలును ఏర్పాటు చేయడమే. అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతం ఇప్పుడు సుమారు 2,071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. వివిధ జిల్లాల నుండి వందలాది వాహనాలు ప్రతిరోజూ నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఔటర్ రింగ్ జాతీయ రహదారుల ద్వారా వచ్చే ప్రయాణికులు తమ వాహనాలను శివారులోనే పార్క్ చేసి.. మెట్రో ద్వారా నగరంలోని ఏ మూలకైనా వేగంగా చేరుకోవచ్చు. దీనివల్ల నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా.. వాహన కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. శివారు ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు వెలిసి స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.సాధారణంగా నగరంలో మెట్రో పనులు చేపట్టాలంటే భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ.. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే స్పష్టమైన మార్గం ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధ్యలో రీజినల్ రింగ్ రైల్ కోసం గతంలోనే 25 మీటర్ల స్థలాన్ని కేటాయించి వదిలేశారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా.. ఎలాంటి ఆస్తుల సేకరణ అవసరం లేకుండానే మెట్రో పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇందుకోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు.ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయడం. భవిష్యత్తులో ఈ ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్య 25కి చేరనుంది. ఈ స్టేషన్ల నుండి ప్రజలు నిర్మిస్తారు. అంతేకాకుండా.. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లతో కూడా ఈ మెట్రో లైన్‌ను అనుసంధానిస్తారు. ప్రతి స్టేషన్ వద్ద భారీ వాహన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల సొంత వాహనాల్లో వచ్చేవారు వాటిని అక్కడ సురక్షితంగా ఉంచి మెట్రోలో ప్రయాణించవచ్చు. ఈ వలయాకార మెట్రో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రవాణా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటుంది.