: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, క్విక్ కామర్స్ సంస్థ జొమాటోకే చెందిన బ్లింకిట్ పేరెంట్ కంపెనీ ఎటర్నల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు. గిగ్ వర్క్ మోడల్‌పై కొంత కాలంగా జరుగుతున్న చర్చకు ఇప్పుడు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X లో వరుస పోస్టులు పెట్టారు. గిగ్ వర్కర్లకు సరైన వేతనం అందట్లేదని.. సామాజిక భద్రత అందట్లేదన్న విమర్శల్ని మరోసారి తోసిపుచ్చారు గోయల్. ఈ మేరకు డెలివరీ పార్ట్‌నర్స్ సంపాదన పెరుగుతుందని.. దీనికి సంబంధించి గణాంకాల్ని కూడా వెల్లడించారు. పెరిగిందని వివరించారు. 2024లో గంటకు జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ సంపాదన రూ. 92 గా ఉండగా.. 2025 నాటికి అది 10.9 శాతం పెరిగి రూ. 102 కు చేరిందని చెప్పారు. ఇక్కడ ఒక డెలివరీ భాగస్వామి రోజుకు 10 గంటల చొప్పున.. ఆదివారాలు పోనూ నెలకు 26 రోజులు సగటున పనిచేసినా కూడా సుమారు రూ. 26,500 గ్రాస్ ఆదాయం వస్తుందన్నారు. ఇక్కడ వారి పెట్రోల్ ఖర్చులు సహా ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల్ని తీసేస్తే నికర ఆదాయం రూ. 21 వేలుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా కస్టమర్లు అదనంగా వారికి టిప్స్ ఇస్తుంటారని దానిని కలపలేదని వెల్లడించారు. ఇంకా గిగ్ వర్క్ ఇప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగమేం కాదని.. ఇదొక అదనపు ఆదాయ మార్గమని గోయల్ నొక్కి చెప్పారు. 2025లో మొత్తంగా చూస్తే డెలివరీ పార్ట్‌నర్ సగటున సంవత్సరంలో కేవలం 38 రోజులు మాత్రమే పనిచేశారని గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన రోజుకు సగటున 7 గంటలే లాగిన్ అయినట్లు ఉదహరించారు. ఇక మొత్తం డెలివరీ భాగస్వాముల్లో కేవలం 2.3 మంది మాత్రమే ఒక సంవత్సరంలో 250 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పని చేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయి ఉద్యోగులతో సమానంగా.. గిగ్ వర్కర్లకు జీతాలు, ఇతర ప్రయోజనాలు అందించాలన్న వాదన సరైనది కాదని అన్నారు. ఇదే సమయంలో ఆయన కొట్టిపారేశారు. తక్కువ సమయం ఉండటం వల్ల డెలివరీ భాగస్వాములు వేగంగా బైక్స్ నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆరోపణలు రాగా.. స్టోర్లు పెరగడం వల్లే క్విక్ డెలివరీలు వచ్చాయని చెప్పారు. ఇక్కడ బ్లింకిట్ స్టోర్స్ కస్టమర్ లొకేషన్ నుంచి సగటున 2 కి.మీ. లోపే ఉంటాయని.. దీని వల్ల వేగంగా వెళ్లకున్నా 8 నిమిషాల్లోనే డెలివరీ సాధ్యమవుతుందని వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ సగటున గంటకు కేవలం 16 కి.మీ. వేగంతోనే ప్రయాణిస్తారని స్పష్టం చేశారు.గిగ్ వర్కర్ల సామాజిక భద్రతపై కూడా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025లో జొమాటో, బ్లింకిట్ కలిసి రూ. 100 కోట్లకుపైగా డెలివరీ పార్ట్‌నర్స్ బీమా కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ అందిస్తున్నట్లు వివరించారు. ఇంకా మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. నెలకు 2 రోజులు పెయిడ్ లీవ్స్ ఇస్తున్నట్లు కూడా తెలిపారు.